జాతీయ వార్తలు

ఉత్త‌మ న‌టిగా అలియా, ఉత్త‌మ న‌టుడిగా ర‌ణ్‌వీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: గ‌త రాత్రి ఐఫా(ఇంటర్నేష‌న‌ల్ ఇండియ‌న్ ఫిలిం అకాడ‌మీ) అవార్డ్స్ ఘ‌నంగా జ‌రిగాయి. బాలీవుడ్ ప్ర‌ముఖ తారలంతా ఈ వేడుక‌కి హాజ‌రు కాగా, కార్య‌క్ర‌మం సంద‌డిగా జరిగింది. రాజీ చిత్రానికి గాను అలియా భ‌ట్ ఉత్త‌మ న‌టి అవార్డు అందుకోగా, ప‌ద్మావ‌త్‌లో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర‌ని అద్భుతంగా పోషించిన ర‌ణ్‌వీర్ సింగ్ ఉత్త‌మ న‌టుడి అవార్డు అందుకున్నారు. ఉత్త‌మ చిత్రంగా రాజీ ఎంపికైంది. ఉత్త‌మ డైరెక్ట‌ర్‌గా శ్రీ రామ్ రాఘ‌వ‌న్ అవార్డు అందుకున్నారు. విక్కీ కౌశ‌ల్, అదితిరావు హైద‌రి బెస్ట్ స‌పోర్టింగ్ రోల్‌కి గాను అవార్డు తీసుకున్నారు.ఐఫా అవార్డుల వేడుక కార్య‌క్ర‌మం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా దీపికా ప‌దుకొణేకి స్పెష‌ల్ అవార్డ్ ఇచ్చారు. బ‌ర్ఫీ చిత్రానికి గాను ర‌ణ‌బీర్ క‌పూర్ స్పెష‌ల్ అవార్డ్ అందుకున్నారు. ఇక స్పెష‌ల్ అవార్డ్ కేటగిరీలో ఉత్త‌మ ద‌ర్శ‌కుడు అవార్డు రాజ్ కుమార్ హిరాణీకి ద‌క్కింది.