జాతీయ వార్తలు

లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్థారుూ సంఘం సిఫార్సు ఆచరణలో అసాధ్యమన్న పార్టీలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: లోక్‌సభకు, దేశవ్యాప్తంగా గల అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని న్యాయ, సిబ్బంది వ్యవహారాలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థారుూసంఘం సిఫార్సు చేసింది. ఇప్పటికిప్పుడే కాకపోయినా దశలవారీగా దీన్ని అమలు చేయవచ్చని సూచించింది. స్థారుూసంఘం ఇచ్చిన ప్రశ్నావళికి సమాధానాలు ఇచ్చిన రాజకీయ పక్షాల్లో చాలామట్టుకు లోక్‌సభకు, రాష్ట్రాల విధానసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే సూచన చాలా మంచిదని, అయితే అమలు చేయడం కష్టమని పేర్కొన్నాయి. సమీప భవిష్యత్తులోనే ప్రతి అయిదేళ్లకోసారి లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం జరుగకపోవచ్చని, అయితే కొన్ని శాసనసభల గడువును తగ్గించడం, కొన్ని శాసనసభల గడువును పొడిగించడం ద్వారా దశలవారీగా నెమ్మదిగా దీన్ని సాధించవచ్చని ‘లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలు’ అనే శీర్షికతో రూపొందించిన తన నివేదికలో స్థారుూసంఘం పేర్కొంది. ఈ నివేదికను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఎన్నికల చట్టం ప్రకారం, సభ గడువు ముగియడానికి ఆరు నెలల ముందు తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. అత్యయిక పరిస్థితి అమలులో ఉంటే తప్ప చట్టసభల గడువును పొడిగించడానికి వీలు లేదు. అయితే శాసనసభ పదవీకాలాన్ని తగ్గించడం లేదా పొడిగించడంపై కొన్ని రాష్ట్రాలలో అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడం కష్టమని కూడా స్థారుూసంఘం భావించింది. ఆర్థికాభివృద్ధికి, ఎన్నికల హామీల అమలుకు తరచుగా వస్తున్న ఎన్నికల వల్ల ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఆటంకాలు సృష్టిస్తోందని స్థారుూసంఘం తన నివేదికలో పేర్కొంది. ఎఐఎడిఎంకె, అసోం గణపరిషత్‌లు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సూత్రబద్ధంగా అంగీకరించాయి. శిరోమణ అకాలీదళ్ ఈ భావనతో ఏకీభవిస్తూనే హంగ్ అసెంబ్లీలు ఏర్పడిన పక్షంలో ఎదురయ్యే ఇబ్బందులకు సంబంధించి కొన్ని సందేహాలను వ్యక్తం చేసింది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌లు ఈ ప్రతిపాదనను తోసిపుచ్చాయి. మంచి ఆలోచనే అయినప్పటికీ ఆచరణలో అమలు సాధ్యం కాదని అవి పేర్కొన్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి), సిపిఐలు కూడా ఒకేసారి ఎన్నికల నిర్వహణ ఆచరణలో సాధ్యం కాదని పేర్కొన్నాయి.