జాతీయ వార్తలు

రైళ్లను పేల్చేందుకు కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, నవంబర్ 30: జమ్ములో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు ముష్కరులు సాంబా జిల్లాలో ఒక సొరంగం ద్వారా భారత భూభాగంలోకి ప్రవేశించారని సరిహద్దు భద్రతాదళం గుర్తించింది. భారత్, పాక్ సరిహద్దు ప్రాంతంలో ఒక సొరంగాన్ని గుర్తించింది. నగ్రోటాలో ఎదురుకాల్పులు జరిగిన ఇరవై నాలుగు గంటల్లో సైన్యం జరిపిన సర్చ్ ఆపరేషన్‌లో విస్మయం గొలిపే అంశాలు బయటపడ్డాయి. ఇరుదేశాల సరిహద్దుల్లో ఒక సొరంగాన్ని తాము గుర్తించామని, అందులోనుంచే మిలిటెంట్లు మన దేశంలోకి చొరబడ్డారని బిఎస్‌ఎఫ్ డిజి కెకె శర్మ తెలిపారు. ఉగ్ర ముష్కరులు దేశంలో వరుస దాడులకు కుట్ర పన్నారని, నడుస్తున్న రైళ్లను పేల్చేందుకు ఎత్తుగడ వేశారని వారి దగ్గర అత్యంత ప్రమాదకరమైన ఐఈడి, ద్రవ పేలుడు పదార్థాలను కనుగొన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. సైన్యం హతమార్చిన ముగ్గురు టెర్రరిస్టుల దగ్గర అయిదు సీసాల్లో ద్రవరూపంలో ట్రినైట్రోగ్లిసరిన్ పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు.
‘‘్భరీ పేలుళ్లకు పాల్పడేందుకే మిలిటెంట్లు చొచ్చుకొచ్చారు. రైల్ ట్రాక్‌లను, నడుస్తున్న రైళ్లను పేల్చడానికి కుట్ర చేశారు’’ అని బిఎస్‌ఎఫ్ అదనపు డిజి అరుణ్‌కుమార్ వివరించారు. నడుస్తున్న రైళ్లను పేల్చటం ద్వారా దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించాలని అనుకున్నారన్నారు. మన సైన్యం పలువురు జవాన్లను కోల్పోయిన తరువాత కానీ, ఉగ్రవాదులను మట్టుపెట్టినా, బహుళ అంచల వ్యవస్థ కారణంగా పెను ప్రమాదాన్ని తప్పించాయని ఆయన వివరించారు. చనిపోయిన ముగ్గురు టెర్రరిస్టుల దగ్గర 10 ఐఈడి పరికరాలు, మరో అయిదు ద్రవ పేలుడు పదార్థాలున్న పరికరాలు, మూడు ఐఈడి నడుము బెల్టులు అయిదు చైన్ ఐఈడిలను స్వాధీనం చేసుకున్నారు. చైన్ ఐఈడిలను ముఖ్యంగా రైల్వే ట్రాక్‌లను, నడుస్తున్న రైళ్లను పేల్చటానికి వినియోగిస్తారు. నైట్రోగ్లిజరిన్‌లు డైనమైట్‌ల మాదిరిగా పేలుతాయి. వీటిని 1847లో కనుగొన్నారు. గ్లిజరిన్‌కు యాసిడ్‌లను కలిపి ఈ పేలుడు పదార్థాన్ని తయారు చేస్తారు. ఇది పేలితే భారీ విధ్వంసం తప్పదు. చనిపోయిన టెర్రరిస్టుల దగ్గరి నుంచి మూడు ఏకె-47 రైఫిళ్లు, ఒక పిస్తోల్, 20 మాగజైన్‌లు, 514 ఏకే రౌండ్ బుల్లెట్లు 31 గ్రెనేడ్‌లు, ఆహార పదార్థాలు లభించాయి.
నగ్రోటాకు ఆర్మీ చీఫ్
జమ్ములోని నగ్రోటా ఆర్మీ క్యాంపుపై మంగళవారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఏడుగురు జవాన్లు చనిపోయిన నేపథ్యంలో సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ బుధవారం సందర్శించారు. మంగళవారం నాటి ఉగ్రదాడి అనంతర పరిస్థితిని ఆయన సమీక్షించారు. సరిహద్దుల్లో టెర్రరిస్టులకోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు ఆయనకు వివరించారు. ఉగ్రవాదులకు ఇక ఎలాంటి చిన్న అవకాశం కూడా ఇచ్చేది లేదని సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు వివరించారు.