జాతీయ వార్తలు

‘పాన్’ లేనివాళ్లు తప్పుడు సమాచారం ఇస్తే జరిమానా.. జైలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: కొత్త సంవత్సరం (జనవరి 1)నుంచి అమలులోకి వచ్చే ఆదాయం పన్ను నిబంధనల్లో భాగంగా కొన్ని రకాల విలువైన లావాదేవీలు జరిపే పాన్‌కార్డు లేని వ్యక్తులు తప్పుడు సమాచారం గనుక ఇస్తే ఏడేళ్ల దాకా జైలుశిక్షతో పాటుగా భారీ జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 1నుంచి పర్మనెంట్ అకౌంట్ నంబరు( పాన్)ను అమలు చేయడం కోసం ప్రభుత్వం జారీ చేసిన విధి విధానాల ప్రకారం పాన్ లేకుండా, దాన్ని తప్పనిసనిగా కోట్ చేయాల్సిన లావాదేవీలు జరిపే వ్యక్తులు ‘్ఫమ్ నంబరు 60’ని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఒక పేజి ఉండే ఈ ఫామ్‌లో లావాదేవీలు జరిపే వ్యక్తి వ్యక్తిగత వివరాలతో పాటుగా ఆధార్ లేదా ఓటరు ఫోటో గుర్తింపు కార్డు లాంటి ఐడెంటిటీ, చిరునామాకు సంబంధించిన వివరాలు కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ‘పాన్ లేనప్పటికీ భారీ మొత్తంలో లావాదేవీలు జరిపే వ్యక్తులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. అలాంటి వారు ఫామ్-60ని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ తప్పుడు సమాచారం ఇచ్చిన పక్షంలో ఐటి చట్టాల కింద గరిష్ఠంగా ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా, లేదా అదనంగా మరో మూడు నెలల జైలుశిక్షను ఎదుర్కొనాల్సి ఉంటుంది’ అని ఐటి శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అలాంటి వారిపైన ఆదాయం పన్ను చట్టంలోని 277 సెక్షన్ కింద ఒక కేసు దాఖలు చేసే అధికారం డిపార్ట్‌మెంటుకు ఉందని ఆయన చెప్పారు.
ఈ సెక్షన్ ప్రకారం ఫామ్-60లో తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా రూ. 25 లక్షలకు మించిన మొత్తానికి పన్నును ఎగవేసిన పక్షంలో జరిమానాతో పాటుగా ఆరునెలలనుంచి 7 ఏళ్ల మధ్య కఠిన కారాగార శిక్ష, అంతకన్నా తక్కువ మొత్తం అయిన పక్షంలో జరిమానాతో పాటుగా మూడు నెలలనుంచి 2 సంవత్సరాల వరకు జైలుశిక్ష విధించవచ్చు. 50 వేల రూపాయలకు పైబడిన హోటల్ బిల్లుల చెల్లింపులు, విదేశీ ప్రయాణపు బిల్లు, కార్డు లేదా నగదుపై రూ. 2 లక్షలకు పైబడిన విలువున్న ఆభరణాల కొనుగోళ్లు, పది లక్షలకు పైబడిన స్థిరాస్తి కొనుగోళ్లు, బ్యాంకులు, పోస్ట్ఫాసులు, నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థల్లో 50 వేలకు మించిన టర్మ్ డిపాజిట్లు లేదా ఏడాదిలో 5 లక్షలకు పైగా ఉండే లావాదేవీలకు జనవరి 1నుంచి పాన్‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.