జాతీయ వార్తలు

ఆర్థిక అసమానతలే ఉద్యమాలకు కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగ్రవర్ణాలకూ రిజర్వేషన్లివ్వండి
ఓసి సంక్షేమ సంఘం డిమాండ్
న్యూఢిల్లీ, మార్చి 13: అగ్రవర్ణాల రిజర్వేషన్లకోసం వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని ఓసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి కరుణాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఫరీదాబాద్‌లోని జాట్ భవన్‌లో ఆల్ ఇండియా రిజర్వేషన్ ఫ్రంట్ ఆధ్యర్యంలో జరిగిన సమావేశంలో కరుణాకర్ రెడ్డి ప్రసంగించారు. అగ్రవర్ణ పేదల సమస్యలపై యుపిఏ, ఎన్‌డియే ప్రభుత్యాలు అనేక కమిటీలు వేసి నివేదికలు ఆమోదించకుండా కాలయాపన చేయడం తగదని, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో మేజర్ జనరల్ సిన్హా కమిటీ నివేదిక అమలుచేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆర్థిక అసమానతల కారణంగానే వివిధ రాష్ట్రాలలో పటేల్, జాట్, గుజ్జర్లు, కాపులు తదితర కులాల వారు రిజర్వేషన్లకోసం ఆందోళనలు చేస్తున్నారని కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.