జాతీయ వార్తలు

శాంతి ప్రక్రియ ఆగలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఏప్రిల్ 15: భారత్‌తో శాంతి చర్చలు నిలిచిపోయాయన్న వాదనను పాకిస్తాన్ తిరస్కరించింది. ఇరుదేశాల మధ్య మొదలైన శాంతి ప్రక్రియ మొదలవుతుందని ఇందుకు సంబంధించి తాము భారత్‌తో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని పాక్ వెల్లడించింది. అన్ని రకాలుగానూ పరిస్థితులను చక్కదిద్దేందుకు ముందుకు వెళ్లాలే తప్ప అవకాశాలను జారవిడుచుకోకూడదని పాక్ విదేశాంగ కార్యాలయం స్పష్టం చేసింది. భారత్‌తో శాంతి చర్చలు నిలిచిపోయాయంటూ ఇటీవల పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ప్రకటించిన నేపథ్యంలోఈ తాజా ప్రకటన వెలువడడం గమనార్హం. ఏ సమస్య పరిష్కారానికైనా చర్చలే ఉత్తమ మార్గమని, దౌత్య ప్రక్రియ అన్నది ఇరుదేశాల మధ్య సంప్రదింపులను పరిష్టం చేయడానికి ఉపయోగపడుతుందని పాక్ విదేశాంగ ప్రతినిధి నఫీజ్ జకారియా తెలిపారు. గత డిసెంబర్‌లో ఇరుదేశాలు శాంతి ప్రక్రియను పునరుద్ధరించాలని నిర్ణయించాయి. సమగ్ర ద్వైపాక్షిక చర్చలు(సిబిడి) పేరుతో వీటిని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాయి. భారత ప్రధాని మోదీ లాహోర్ పర్యటన సందర్భంగా సరికొత్త రీతిలో చర్చల ప్రక్రియకు నాందీ ప్రస్తావన జరిగింది.