జాతీయ వార్తలు

నాలుగు రోజులకే గర్భస్థ శిశువుకు గుండె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 28: తల్లి గర్భం దాల్చిన నాలుగులోజులకే శిశువుకు గుండె రూపుదిద్దికుంటుంది. గర్భస్రావాలపై శాస్తవ్రేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. నేచర్ జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో అధ్యయన నివేదిక ప్రచురితమైంది. తల్లి కడుపులో పిండం గుండె ఎదుగుదలపై పరిశోధనలు జరిపారు. లీడ్స్ యూనివర్శిటీ శాస్తవ్రేత్తలు ఎంఆర్‌ఐ టెక్నాలజీని ఉపయోగించి అధ్యయనం చేశారు. గుండె సంపూర్ణంగా రూపొందడానికి 13 నుంచి 20 వారాలు సమయం తీసుకుంటుందని తెలిపారు. 95 నుంచి 143 రోజుల శిశువుగుండె ఎదుగుదలను 3డి కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ద్వారా పరీక్షించారు. మొత్తం 23 గర్భస్థ శిశువులను పరిశీలించిన తరువాత నాలుగురోజులకే గుండె రూపుదిద్దుకోవడం మొదలవుతుందని తేల్చారు. గుండెకు సంబంధించి నాలుగు రోజులు నుంచి 124 రోజుల మధ్య ఎన్నో కీలకమైన మార్పులు సంభవిస్తాయని నివేదికలో వెల్లడించారు. స్వల్పకాలంలోనే గుండె చుట్టూ కండరాలు ఏర్పడడం గమనించారు. ‘కడుపులో గర్భస్థ శిశువు గుండె రూపొందడం, ఎదుగులను మేం గుర్తించాం. అన్ని గణాంకాలను లెక్కలోకి తీసుకున్న తరువాత పిండం ఎదుగుదలకు ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయో తెలుసుకున్నాం’ అని లీడ్స్ వర్శిటీ పరిశోధకులు వెల్లడించారు.