జాతీయ వార్తలు

ఈ ఏడాది చివరికల్లా భారత్‌తో ఎఫ్‌జిఎఫ్‌ఏ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెనౌలిమ్ (గోవా), అక్టోబర్ 16: భారత్‌తో సుమారు 60 వేల కోట్ల రూపాయల విలువైన రక్షణ ఒప్పందాలను కుదుర్చుకున్న రష్యా ఐదోతరం యుద్ధ విమానాలపై (ఎఫ్‌జిఎఫ్‌ఏ) మరో ఒప్పందం ఈ ఏడాది చివరినాటికల్లా కుదురుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ‘మా వైపునుంచి ఈ ఒప్పందం పూర్తయింది. ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఇక భారత్ వంతే మిగిలి ఉంది. కొన్ని లాంఛనాలను పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఏడాది చివరికల్లా ఈ ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని నేను ఆశిస్తున్నాను’ అని రష్యాలో దాదాపు 700 హైటెక్ పౌర, రక్షణ ఉత్పాదక సంస్థల కూటమి అయిన రోస్టెక్ స్టేట్ కార్పొరేషన్ సిఈఓ సెర్గీ చెమెజోవ్ ఆదివారం ఇక్కడ విలేఖరులకు చెప్పారు. దాదాపు ఏడాది ప్రతిష్టంభన తర్వాత భారత్, రష్యాలు ఇప్పటికే ఎంతో ఆలస్యమైన ఈ ప్రాజెక్టుపై రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తర్వాత గత ఫిబ్రవరిలో తిరిగి చర్చలు ప్రారంభించాయి. కొత్త ఆఫర్ కింద భారత్ ఈ యుద్ధ విమానాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, మూడు ప్రోటోటైప్‌లకోసం 600 కోట్ల డాలర్లకు బదులు 370 కోట్ల డాలర్లు రష్యాకు చెల్లించాలి. భారత్‌లో పర్‌స్పెక్టివ్ మల్టీరోల్ ఫైటర్ (పిఎంఎఫ్)గా పిలిచే ఈ విమానం ప్రాథమిక డిజైన్‌కోసం 29.5 కోట్ల డాలర్లు చెల్లించడానికి 2010లో భారత్ అంగీకరించిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఎఫ్‌జిఎఫ్‌ఏ ప్రాజెక్టుద్వారా అత్యంత అత్యధునాతనమైన యుద్ధ విమానాన్ని రూపొందిస్తుందని, రష్యాకు చెందిన అత్యధునాతన టెక్నాలజీపై రష్యా, భారతీయ ఇంజనీర్లు జరిపిన ప్రయోగాల ఫలితంగా ఈ విమానం రూపొందుతుందని చెమెజోవ్ చెప్పారు. రష్యాకు చెందిన అయిదోతరం యుద్ధ విమానం పిఏకె-ఎఫ్‌ఏ టి-50 యుద్ధ విమానానికి దీటుగా ఇది ఉంటుందని, అయితే మరికొన్ని సంవత్సరాల తర్వాత ఇది తయారవుతుంది కనుక కొన్ని విషయాల్లో ఇది ఆ విమానాన్ని మించి ఉంటుందని కూడా ఆయన చెప్పారు.

చిత్రం.. గోవాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ