జాతీయ వార్తలు

ఐరాస పోస్టర్ పోటీలో భారతీయ యువతికి బహుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, మే 14: అణు నిరాయుధీకరణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన పోస్టర్ పోటీలో విజేతలయిన ముగ్గురిలో 22 ఏళ్ల భారతీయ చిత్రకారిణి అంజలీ చంద్రశేఖర్ ఉన్నారు. శాంతి కపోతం ఒకటి అణ్వాయుధాన్ని చీల్చుకుని ఎగురుతున్నట్లుగా ఉన్న అంజలి వేసిన చిత్రానికి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్ ప్రశంసలు కూడా లభించాయి. ఇదే కాకుండా చెన్నైకి చెందిన బాలిక ‘బ్రేక్ ఫ్రీ’ అనే టైటిల్‌తో వేసిన చిత్రానికి సైతం ప్రశంసా పత్రం లభించింది. ఈ నెల 3వ తేదీన ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో బాన్ కి-మూన్ ఈ అవార్డులను ప్రదానం చేశారు. అంజలి వేసిన చిత్రానికి తృతీయ బహుమతి లభించగా, పెరూకు చెందిన ఇవాన్ కిరో పలోమినో హ్యుమాని వేసిన చిత్రానికి ప్రథమ బహుమతి 15 ఏళ్ల మిచెల్లీ లి వేసిన చిత్రానికి ద్వితీయ బహుమతి లభించింది. 123 దేశాలనుంచి 4,100కు పైగా వచ్చిన ఎంట్రీలనుంచి ఈ మూడింటితో పాటు మరో తొమ్మిదింటిని ప్రశంసార్హమైనవిగా ఎంపిక చేశారు.