శ్రీకాకుళం

ఐటిడిఎలో అవకతవకలను పట్టించుకోరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 20: జిల్లాలోని సీతంపేట ఐటిడిఎ పరిధిలో కోట్ల రూపాయలు అవకతవకలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోదా అంటూ శాసనసభ్యుడు కలమట వెంకటరమణ ఆరోపించారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో పాలకొండ శాసనసభ్యురాలు విశ్వసరాయి కళావతితో కలిసి ఆయన మాట్లాడారు. గిరిజనులకు చెందాల్సిన ఫలాలు అధికారులు దోపిడీ చేస్తున్నా ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారని, ఇదే విషయాన్ని తాము అసెంబ్లీలో ప్రస్తావించినా నేటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోపోవడం శోచనీయమని అన్నారు. 2013-14 ఏడాదికి సంబంధించి గిరిజన రైతులకు సుమారు రెండు కోట్ల రూపాయల విలువ చేసే క్రిమి సంహారక మందులు, ఎరువులు కొనుగోలు చేసి వాటిని నేటి వరకు ఏ ఒక్కరికీ పంపిణీ చేయలేదని ఆరోపించారు. పైగా వాటికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన నేటి ఐటిడిఎ పివో ఏడాదిగా మూలుగుతున్న మందులు ఎందుకు ఉండిపోయాయో కనీస విచారణ చేపట్టకుండా 91 లక్షల రూపాయలు కేటాయించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇందులో అక్రమాలు జరిగాయాయని, దీనిపై కలెక్టర్ విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
గిరిజనులు మృతిచెందితే వారిని ఐటిడిఎ పివో పరామర్శించడం, వారి కుటుంబ బాగోగులు చూడటం గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కని అయితే పివోగా బాధ్యతలు చేపట్టిన తను ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
గిరిజనుల పోస్టుల భర్తీలో సైతం ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో విధంగా వివక్ష చూపిస్తున్నారని, పాతపట్నం, పాలకొండ నియోజకవర్గాల్లో ఖాళీలను నేటికి భర్తీచేయలేదని విమర్శించారు. వీటన్నింటిపైన తాము పోరాటం చేస్తామని చెప్పారు. అవసరమైతే తాము ఐటిడిఎ కార్యాలయం ముందు నిరాహారదీక్షకు వెరవమని అన్నారు.

జిల్లాలో కొత్త ఒరియా స్కూళ్ళు
శ్రీకాకుళం, నవంబర్ 20: జిల్లాలోని కంచిలి, కవిటి, మందస, ఇచ్ఛాపురం, సోంపేట మండలాల్లో ఒరియా కుటుంబీకులు అధికంగా ఉన్నందున ఆయా ప్రాంతాల్లో ఒరియా కెజిబివి పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాధనలు పంపాలని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం రాజీవ్ విద్యా మిషన్ ప్రోజెక్టు అధికారిని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో కెజిబివి స్కూల్స్ నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతంలో ఒరియా విద్యార్థుల్లో ఎంత మంది డ్రాపవుట్‌లు ఉన్నారో సమగ్ర నివేదికను సేకరించాలని ఆదేశించారు. పదో తరగతిలో శతశాతం ఫలితాలు సాధించాలని ఆదేశించారు. విద్యార్థినుల వద్ద సెల్‌పోన్స్ ఉండరాదని సూచించారు. అయితే వారి తల్లిదండ్రులతో మాట్లాడుకోవడానికిగాను పాఠశాల ఆవరణలో కాయిన్ బాక్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. పిల్లలపై ఒత్తిడి లేకుండా విద్యను చెప్పాలని, విద్యార్థులకు ఇచ్చే మెనూ సక్రమంగా ఉండాలని తెలిపారు. దీనిలో ఎటువంటి తేడా ఉన్నా సహించేదిలేదన్నారు. సమావేశంలో ఆర్వీయం ఈఈ పి.సుగుణాకరరావు, ఎఎంవో జగదీష్‌బాబు, జిసిడివో ఎన్.నీరజ, ఎపివో జి.వి.రమణారావు తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రపుష్కరిణి ప్రక్షాళన
శ్రీకాకుళం, నవంబర్ 20: సుప్రసిద్ధి పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణస్వామివారి దేవస్థానంలో గల ఇంద్రపుష్కరిణీ నూతన శోభ నెలకుంది. ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటరావు పర్యవేక్షణలో ఇంద్రపుష్కరిణిని ప్రక్షాళన చర్యలు ముమ్మరం చేశారు. మరో నాలుగు రోజుల్లో చిలకద్వాదశి సందర్భంగా తెప్పోత్సవ వేడుక నిర్వహించిన నేపథ్యంలో పుష్కరిణీ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పుష్కరిణీలోగల పాతనీటిని తొలగించి కొత్తనీటిని నింపారు. చుట్టూ సున్నాలు, రంగులు వేయించారు. అదే విధంగా అన్ని వైపులా ఎల్‌ఇడి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడమేకాకుండా ప్రతీ ఏటా అంచనాలకు మించి భక్తులు రానున్న నేపథ్యంలో అందరూ తిలకించే అవకాశం కలిగించేవిధంగా ఇనుపకంచెలను బిగించారు. అదే విధంగా పదిహేనుమంది గజ ఈతగాలను నియమించారు. ఇంద్రపుష్కరిణీలోగల మహిళల స్నానాల గది, గోశాల, రావిచెట్టు తదితర పట్ల మరమ్మతులు చేయించారు. ఆకతాయిలు పుష్కరిణీలో అసాంఘీక కార్యకలాపాలకు తావులేకుండా పటిష్ఠమైన అదనపు గోడలను గేట్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఇవో తెలిపారు. విఐపిలు రాకనిమిత్తం పుష్కరిణికి ఈశాన్యం వైపు ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటుచేశారు. ఈ సహాయక చర్యల్లో నీటి పారుదల శాఖ, మత్స్యశాఖ, పోలీస్ శాఖ పురపాలకశాఖ అధికారులు సహకారాన్ని తీసుకున్నామన్నారు.