శ్రీకాకుళం

టి.డి.పి.లో చేరికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, ఏప్రిల్ 9: పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది గ్రామాల్లో కండువాలు కప్పుకునే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అధికంగా తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇందులో భాగంగా ధర్మలక్ష్మిపురం పంచాయితీ మాజీ సర్పంచు దువ్వారి లక్ష్మికాంతమ్మ తాజాగా స్థానిక టి.డి.పి. నేతలు సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు. ప్రధాన పార్టీలకు ప్రతిష్టాకరంగా ఉన్న బెజ్జి గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి సురవరపు తిరుపతిరావు సమక్షంలో పలువురు యువకులు టి.డి.పి.లో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి నేతలు సాదరంగా ఆహ్వానించారు.

ఒక అవకాశం ఇవ్వండి, పలాసను అభివృద్ధి చేస్తా: సీదిరి
మందస, ఏప్రిల్ 9: 60 ఏళ్లు గౌతు కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడి ఒక అవకాశం ఇస్తే పలాస నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చి అభివృద్ధి చేసి ప్రజలు జీవన ప్రమాణాలను పెంపొందించడానికి కృషి చేస్తానని పలాస వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. మంగళవారం రట్టి, బేతాళపురం, దున్నూరు, సిగలపుట్టుగ మత్స్యకార గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆదరాభిమానాలే నా విజయానికి నాంది అని, డాక్టర్‌గా ప్రజలకు సేవలు అందిస్తానని, ప్రజల ఆశీర్వాదాలు, దేవుడు దీవెనలతోనే నా విజయం తథ్యమన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అత్యదిక ఓట్లు మోజార్టీతో ఎంపీ అభ్యర్థి డి.శ్రీనివాస్, పలాస వైసీపీ అభ్యర్థి డాక్టర్ అప్పలరాజును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జుత్తు నీలకంఠం, కె.వాసు, డొక్కర దానయ్య, డి.లీలాకుమారి, బాలక విజయశ్రీ పాల్గొన్నారు.

మచ్చలేని గౌతు కుటుంబాన్ని ఆదరించండి
మందస, ఏప్రిల్ 9: ప్రజల ఆదరాభిమానాలతో 60 ఏళ్లుగా తాత స్వాతంత్య్ర సమరయోధుడు సర్థార్ గౌతు లచ్చన్న, తన తండ్రి గౌతు శ్యామసుందరశివాజీలు ప్రజలకు సేవలు అందించారని, వారి ఆదర్శాలతోనే పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషా ఎన్నికలలో పోటీ చేస్తున్నారని శివాజీ కుమార్తె గౌతు అనురాధ అన్నారు. మంగళవారం కుంటికోట, నర్శింగపురం, జిల్లుండ, సిద్దిగాం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆదరాభిమానానికి సేవలు అందించి, రుణం తీర్చుకుంటానని, పలాస అభ్యర్థి శిరీషా, ఎంపీ అభ్యర్థి కె.రామ్మోహన్‌నాయుడులను, సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మోజార్టీతో గెలిపించాలని కోరారు. మరోమారు సీ ఎం చంద్రబాబునాయుడు సీ ఎంను చేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాసరి జయలక్ష్మి, రట్టి లింగరాజు, రాజాంఝాన్షీ, తాతారావు, శ్రీను, మార్కేండేయులు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి
ఇచ్ఛాపురం(రూరల్), ఏప్రిల్ 9: టీడీపీ ప్రభుత్వానికి మరోమారు అవకాశం ఇస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే బెందాళం అశోక్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని సన్యాసిపుట్టుగ, నీలాపుట్టుగ గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా రామ్మోహన్‌నాయుడును, సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ర్యాలీలో స్థానికులు, ఎంపీపీ ఢిల్లీరావు, సాహదేవ్, కామేషు, కృష్ణారావు, జోగారావు, నీలాద్రి, హరికృష్ణ, బీమారావు,మహిళలు పాల్గొన్నారు.

జగన్‌తోనే రాష్ట్భ్రావృద్ధి
ఇచ్ఛాపురం(రూరల్), ఏప్రిల్ 9: రాష్ట్రానికి జగన్ సీ ఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం వైసీపీ నాయకులు తులసీగాం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి, ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా సాయిరాజ్, ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్‌లను గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో తులసీదాస్, శేషుయాదవ్, కూర్మారెడ్డి పాల్గొన్నారు.