శ్రీకాకుళం

పోలీసు బందోబస్తుతో పసుపు-కుంకుమ చెల్లింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, ఏప్రిల్ 9: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాకరంగా డ్వాక్రా సంఘ మహిళలకు మంజూరు చేసిన పసుపు-కుంకుమ డబ్బులు చెల్లించడానికి బ్యాంకు అధికారులు పలు ఇక్కట్లు పడుతున్నారు. మూడవ విడతగా ఒక్కో సభ్యురాలుకి రూ.4వేలు చొప్పున చెక్కును ముందస్తుగానే ప్రభుత్వం అందజేసింది. ఈ చెక్కులు సమర్పించి బ్యాంకు నుండి ఇందుకు సంబంధించిన పైకం పొందడానికి ప్రతి రోజు ఉదయం 9గంటలకే బ్యాంకులు వద్ద మహిళలు వందల సంఖ్యలో క్యూ కడుతున్నారు. బ్యాంకులలో తగిన నగదు అందుబాటులో లేకపోవడం.. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన మహిళలకు నగదు అందజేయడం సిబ్బంది కొరత కారణంగా బ్యాంకు అధికారులు సతమతం అవుతున్నారు. ఈ దశలో పొలీసు బందోబస్తుతో క్యూలైన్లు ఏర్పాటు చేసి ఒక్కో గ్రూపునకు చెందిన మహిళలను బ్యాంకులోనికి అనుమతిస్తూ చెల్లింపులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా బ్యాంకు తలుపులు వేసి పొలీసు బందోబస్తుతో కేవలం మహిళలను మాత్రమే బ్యాంకులోకి అనుమతిస్తుండడం వలన ఇతర ఖాతా దారులు గంటల సమయం వేచి ఉండవలసి ఉంటుంది. సహకార సంఘం మాజీ అధ్యక్షుడు వరుదు రంగారావు, మరికొంత మంది సాధారణ ఖాతాదారులు గంటల కొలది ఆరుబయట వేచి ఉండడం కనిపించింది. ఇదిలా ఉండగా కొంత మంది మహిళలకు రెండవ విడత చెక్కునకు సంబంధించిన నగదు రూ.3500లు కూడా బ్యాంకు అధికారులు తాజాగా చెల్లింపులు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు మేరకు వెలుగు సిబ్బంది బ్యాంకు బయట నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయగా క్యూలైన్లులో ఉన్న మహిళలకు మండల తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి తిరుపతిరావు టాటాగ్లూకోజును అందజేసారు.

ఓటర్లు జాబితాలో తిరకాసులు
సారవకోట, ఏప్రిల్ 9: తాజాగా విడుదల చేసిన ఓటర్లు జాబితాలో తప్పులు ప్రజలను తిరకాసు పెడుతున్నాయి. ఒక పోలింగ్ కేంద్రంలో నమోదు కావలసిన ఓటర్లును వేరే పోలింగ్ కేంద్రాల ఓటర్లు జాబితాలో చేర్చడం వలన కొత్తగా నమోదైన ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని అర్లి గ్రామానికి చెందిన సుమారు 80మంది ఓటర్లును పోలింగ్ కేంద్రం నెం.210 గోవర్ధనపురం జాబితాలో చేర్చవలసి ఉండగా ఇందుకు భిన్నంగా ఇదే మండలంలోని పి.ఎస్.నెం.212 అన్నుపురం ఓటర్లు జాబితాలో చేర్చారు. కొత్తగా నమోదైన ఓటర్లు ఈ విషయాన్ని తెలుసుకొని తమ పేర్లును అన్నుపురం ఓటర్లు జాబితా నుండి తొలగించి గోవర్ధనపురం ఓటర్లు జాబితాలో చేర్చాలని నిర్ణీత ఫారంలలో ధరఖాస్తు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. తుది జాబితాలో వీరి పేర్లును తొలుత ఓటర్లు కోరిన విధంగా అన్నుపురం ఓటర్లు జాబితా నుండి తొలగించి తిరిగి అదే ఓటర్లు జాబితాలో యదాతధంగా చేర్చడం అధికారుల లీలలకు అద్దంపడుతుంది. ఇదిలా ఉండగా అన్నుపురం గ్రామానికి చెందిన 5గురు ఓటర్లును వేరే వేరే పోలింగ్ కేంద్రాలు జాబితాల్లో చేర్చారు. ఈ గ్రామానికి చెందిన యడ్ల నాగమ్మ పేరును జలుమూరు మండలం సురవరంలో చేర్చగా, దిమ్మిడిజోల యోగేశ్వరరావు, లక్ష్మిపురం సరస్వతి పేర్లును జలుమూరు మండలం కరకవలస పోలింగ్ కేంద్రంలో చేర్చారు. ఇదే గ్రామానికి చెందిన అమరాపు నారాయణ పేరును చిన్నగుజ్జువాడ పోలింగ్ కేంద్రంలో చేర్చగా లుకలాపు చంద్రరావు పేరును గోవర్ధనపురం ఓటర్లు జాబితాలో చేర్చారు. పక్కాగా అన్ని విషయాలు పరిశీలించి తుదిజాబితాలు ప్రచురించామని ప్రకటిస్తున్న అధికారులు ఈ ఓటర్లుకు సమాధానం ఏమి చెబుతారో చూడాలి.