శ్రీకాకుళం

నైపుణ్యాలను వృద్ధి చేసుకుంటేనే ఉన్నతికి తోడ్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార, ఏప్రిల్ 9: విద్యార్ధులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే తమ నైపుణ్యాలను వృద్ధి చేసుకోవాలని శారద ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి బౌరోతు శ్రీనివాసరావు అన్నారు. మండలం అంపోలు శారద ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్ధులను అభినందిస్తూ కళాశాలలో విద్యార్ధుల ఉపాధి అవకాశాలును దృష్టిలో ఉంచుకొని మరిన్ని ప్రాంగణ ఎంపికలు నిర్వహింపజేయనున్నట్లు ఆయన స్పష్టం చేసారు. కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యాసంవత్సరం పూర్తి నాటికి వివిధ కంపెనీలు ద్వారా ప్రాంగణ ఎంపికలు నిర్వహింపజేస్తుండడం బాధ్యత అన్నారు. సొడేషియా మల్టినేషనల్ కంపెనీ సీనియర్ హెచ్.ఆర్. రామ్మోహన్ పర్యవేక్షణలో మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ విద్యార్ధులకు నైపుణ్య పరీక్షలను నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరం కళాశాల వీడుతున్న 40మంది ఇంజనీరింగ్ విద్యార్ధులకు పరీక్ష నిర్వహింపజేయగా అందులో 12 మంది విద్యార్ధులు అర్హత సాధించినట్లు ఆయన స్పష్టం చేసారు. ఇందులో 6గురు విద్యార్ధులు ఎంపికైనట్లు కళాశాల ప్లేస్‌మెంట్ అధికారి జి.జగదీష్‌కుమార్ స్పష్టం చేసారు. ఎంపికైన విద్యార్ధుళకు కళాశాల యాజమాన్యం, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.గోవిందరావు, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. వెంకటస్వామి విద్యార్ధులను అభినందిస్తూ మరిన్ని కశాళాల ప్రాంగణ ఎంపికలు నిర్వహింపజేసే దిశగా చర్యలు చేపట్టామని, విద్యార్ధులు అందుకు సిద్ధంగా తమ యొక్క నైపుణ్యాలను వృద్ధి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెకానికల్ విభాగాధిపతి పి.అజయ్‌కుమార్, ఎలక్ట్రికల్ విభాగాధిపతి చక్రవర్తిలతో పాటు విద్యార్ధులు ఉన్నారు.

మత్స్యకారుల అభ్యున్నతి టి.డి.పి.కే సాధ్యం
సారవకోట, ఏప్రిల్ 9: రాష్ట్రంలో మత్స్యకారుల అభ్యున్నతి తెలగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలోనే జరిగిందని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సాధు చిన్నిక్రిష్ణంనాయుడు, పార్టీ అభ్యర్ధి బగ్గు రమణమూర్తి కుమారుడు బగ్గు రామప్రసాద్, రంగసాగరం నీటి సంఘం అధ్యక్షుడు చిన్నాల మాధవరావు వివరించారు. రంగసాగరం చెరువు గర్భంలో చేపలు వేట చేస్తున్న మత్స్యకారులతో ఎన్నికలు ప్రచారంలో భాగంగా మంగళవారం వీరు మాట్లాడారు. మత్స్యకారులకు 50యేళ్లు వయస్సుకే ఫించన్లు తమ ప్రభుత్వం అందజేసిందని, అదేవిధంగా పక్కా గృహాలు నిర్మాణాలు, వలలు సరఫరా వంటి సంక్షేమ పథకాలుతో పాటు విలువైన చేప పిల్లలను ఉచితంగా సరఫరా చేసామన్నది గుర్తు చేసారు. అలుదు గ్రామంలో ఉపాధిహామీ వేతన దారులు వద్ద వీరు ఎన్నికలు ప్రచారాన్ని నిర్వహించారు. వలసలు నివారించడానికి మహిళల ఆర్ధిక స్వావలంభనకు ఉపాధి హామీ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు చల్ల ఆనందరావు తదితరులు ఉన్నారు.