జాతీయ వార్తలు

అమరావతికి కొత్త రైళ్లు నడపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రానికి గల్లా జయదేవ్ వినతి
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ఏపిసిఆర్‌డిఏ ప్రతిపాదించిన కొత్త రైల్వే లైన్లను రైల్వే బడ్జెట్‌లో చేర్చాలని టిడిపి సభ్యుడు గల్లా జయదేవ్ కేంద్రాన్ని కోరారు. జయదేవ్ సోమవారం లోక్‌సభలో 377 కింద ఇచ్చిన నోటీసుపై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ స్థాయి కొత్త రాజధానిని నిర్మిస్తోందని, ఈ లక్ష్య సాధన కోసం కొన్ని రైల్వే పథకాలను ప్రతిపాదించటం జరిగిందన్నారు. అమరావతిలో కొత్త రైల్వేస్టేషన్, నరసరావుపేట నుంచి రైల్వే లైన్‌ను అమరావతి వరకు పొడిగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వీటితోపాటు అమరావతి నుంచి తిరుపతి మీదుగా చెన్నై వరకు, అమరావతి నుంచి కర్నూలు-అనంతపురం మీదుగా బెంగళూరు వరకు, అమరావతి నుంచి కాకినాడ మీదుగా విశాఖపట్నం వరకు కొత్త రైల్వే లైన్లు నిర్మించాలని జయదేవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అమరావతి నుంచి దేశంలోని ఇతర ముఖ్యమైన పట్టణాలకు హైస్పీడ్ రైళ్లను ఏర్పాటు చేయాలన్నారు. చెన్నై, విశాఖపట్నం, శ్రీసిటీ, తడ విశాఖపట్నం, హైదరాబాద్ - అమరావతి, హైదరాబాద్ -కర్నూలు- అనంతపురం- బెంగళూరు, అమరావతి- చిత్తూరు- శ్రీసిటి- చెన్నై మార్గాల్లో సరుకు రవాణా, పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయాలని ఎంపీ కోరారు. గుంటూరు- మంగళగిరి- విజయవాడ, గుంటూరు- మైసూరు, గుంటూరు- విశాఖపట్నం కొత్త రైళ్లను ఏర్పాటు చేయాలన్నారు. ముంబయి - సికింద్రాబాద్ దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ను గుంటూరు వరకు పొడిగించాలని జయదేవ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.