జాతీయ వార్తలు

జెఎన్‌యు సంఘటనలపై విచారణ : కేజ్రీవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలు, దానికి వ్యతిరేకంగా ఒకవర్గం విద్యార్థులు చేపట్టిన ఆందోళనల దరిమిలా అసలు ఏం జరిగిందన్నది రాబట్టడానికి మెజిస్టీరియల్ విచారణకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆదేశించారు. యూనివర్శిటీలో అఫ్జల్‌గురు దినోత్సవం నిర్వహిస్తూ భారత్ వ్యతిరేక నినాదాలు చేయడం, దానిని ఎబివిపి విద్యార్థులు అడ్డుకోవడంతో వివాదం రేగిన విషయం తెలిసిందే. ఒక విద్యార్థిపై దేశద్రోహ నేరం మోపడం, మరో ఎనిమిది మంది విద్యార్థులను సస్పెండ్ చేయడంతో ఆందోళన మొదలైంది. కాంగ్రెస్, వామపక్షాలు సస్పెండ్ అయిన విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. కాగా దేశవ్యతిరేక చర్యలకు పాల్పడినవారిని ఉపేక్షించేది లేదని, అసలు అలా జరిగిందా లేదా అన్నది నిర్ధారించాల్సి ఉందని, నిందితులపై చర్య తీసుకోక తప్పదని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఈమేరకు ట్విట్టర్‌లో ఆయన వ్యాఖ్యానించారు.