జాతీయ వార్తలు

కన్నయ్య బెయిల్ పిటిషన్‌పై విచారణకు సుప్రీం నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశద్రోహం కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉంటున్న జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. కన్నయ్య పిటిషన్‌పై శుక్రవారం కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించడమే గాక, బెయిల్ కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్‌ను విచారించలేమని, దీన్ని హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లకుండా తమ వద్దకు ఎందుకు వచ్చారని సుప్రీం కోర్టు కన్నయ్య న్యాయవాదిని ప్రశ్నించింది. కన్నయ్యను ఇటీవల పటియాలా హౌస్ కోర్టుకు హాజరుపరచినపుడు జరిగిన దాడులకు సంబంధించి అందిన నివేదికలను సుప్రీం న్యాయమూర్తులు ప్రస్తావించారు. కన్నయ్యను కోర్టుకు తీసుకునివచ్చినపుడు సరైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదని సుప్రీం న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. కన్నయ్య ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన నివేదికను కూడా వారు పరిశీలించారు. కోర్టు వద్ద తోపులాట జరిగిందని పోలీసులు కోర్టుకు నివేదించగా, కన్నయ్య శరీరంపై గాయాలున్నట్లు వైద్యులు నివేదిక ఇవ్వడం గమనార్హం.