జాతీయ వార్తలు

గుల్బర్గ్ కేసులో 24మంది దోషులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుజరాత్:గోద్రా సంఘటన అనంతరం చెలరేగిన అల్లర్లలో గుల్బర్గ్‌లో జరిగిన మారణకాండ కేసులో 24మందిని దోషులని ప్రత్యేక న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ కేసులో మొత్తం 66 మంది నిందితులుకాగా 35మంది నిర్దోషులను పేర్కొంది. 11మందికి హత్య కేసులో దోషులని తేల్చింది. దోషులందరికీ సోమవారంనాడు శిక్షలు ఖరారు చేయనుంది. గోద్రా సంఘటన తరువాత గుల్బర్గ్ సొసైటీ ప్రాంతంలో 69మందిని ఊచకోత కోసిన సంఘటన దేశంలో దుమారం రేపింది. ఈ దాడిలో కాంగ్రెస్ చట్టసభ సభ్యుడు ఇషాన్ జాఫ్రి హత్యకు గురయ్యారు. కాగా కోర్టు తీర్పుపై ఇషాన్ సతీమణి జాక్రి జాఫ్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళతామని అన్నారు. కాగా దోషులుగా తేలినవారిలో బిజెకి చెందిన కార్పొరేటర్ బిపిన్ పటేల్ ఒకరు. ఈ సంఘటనపై 2002లో ఛార్జ్‌షీట్ దాఖలుకాగా సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. సంఘటన జరిగిన 14 సంవత్సరాలకు తీర్పు వెలువడింది.