జాతీయ వార్తలు

సినీనటి జ్యోతిలక్ష్మి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: కొన్ని దశాబ్దాల పాటు దక్షిణాది సినీ ప్రేక్షకులను తన డ్యాన్స్‌లతో అలరించిన సినీనటి జ్యోతిలక్ష్మి (53) మంగళవారం తెల్లవారుజామున చెన్నైలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 300 పైచిలుకు సినిమాల్లో ఆమె తన హావభావాలతో అశేష ప్రేక్షకులను అలరించారు. 1970- 1985 మధ్య కాలంలో ఆమె డ్యాన్స్‌లేని తెలుగు సినిమాలే లేవంటే అతిశయోక్తి కాదు. అనేక చిత్రాల్లో ఆమె అభినయించిన క్లబ్ డ్యాన్స్‌లకు ప్రేక్షకులు వెర్రెత్తిపోయేవారు. తెలుగు అగ్రనటులు ఎన్టీఆర్, ఎఎన్నార్, శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి తదితరులతో ఆమె నటించారు. ఈరోజు మధ్యాహ్నం చెన్నైలో ఆమె అంత్యకియలు జరుగుతాయి.