సాహితి

కలల సాకారం కోసం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేనొక జీవనదిని
కనాలని కలగంటున్నాను

నేల నలుచెరగులా కలియతిరిగి
జీవితాన్ని ఎప్పుడూ తడితడిగా వుంచే సెలయేరుని
కనాలని కలగంటున్నాను

ధర్మాన్ని బహిరంగపరిచి
మానవ మతాన్ని నిర్మించే
ఒక ఏలికను,
నిష్కల్మషమైన మహావీరుల్ని
కనాలని కలగంటున్నాను

జీవితం రణరంగమైనప్పుడు
కష్టాలు మారువేషాలతో నన్ను వేధిస్తున్నప్పుడు
కలల్ని సాకారం చేసుకునేందుకు
ఎన్ని నెత్తుటి దినాలనైన ఖర్చు చేసుకునే
మహా మనీషిని కనాలని కలగంటున్నాను

నవ్వుతూ నవ్వుతూ రక్తతర్పణం చేసి
లోకానికొక నమ్మకాన్ని వాగ్దానం చేసి
బతుకుమీద ఆశల్ని రగిలించి
సుప్రభాత గీతమై గుబులు కుంపట్లను తరిమేసి
మానవతావాదిని కనాలని కలగంటున్నాను

స్వర్గాన్ని కలగంటున్నాను
సకల జనుల కళ్ళల్లో చెలిమ పువ్వు
వికసించటాన్ని కలగంటున్నాను

- కె.విల్సన్‌రావు, 8985435515