జాతీయ వార్తలు

కర్ణాటక పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయ సంక్షోభంపై వేసిన పిటిషన్ల పై విచారణ సుప్రీం కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. కర్నాటక అసెంబ్లీలో తక్షణమే విశ్వాస పరీక్ష జరగాలంటూ ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు తాజాగా దాఖలు చేసిన పిటీషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు తెలిపింది. శాసనసభ సమావేశాలలో చర్చ జరుగుతున్న సందర్భంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదిస్తూ ఇవాళ సాయంత్రం 6గంటల లోపు బలపరీక్ష నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. విశ్వాస పరీక్ష పేరిట రోజూ సభను వాయిదా వేస్తున్నారని వివరించారు. స్పీకర్ కావాలనే బలపరీక్షను వాయిదా వేస్తున్నారని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం చర్చ జరుగుతుండగా తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.