జాతీయ వార్తలు

కర్నాటకలో క్యాబినెట్ ప్రక్షాళనకు సోనియా ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్నాటక మంత్రివర్గంలో మార్పులు, చేర్పులకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎట్టకేలకు పచ్చజెండా ఊపారు. మంత్రివర్గం ప్రక్షాళన విషయమై కర్నాటక సిఎం సిద్ధరామయ్య, కెపిసిసి అధ్యక్షుడు పరమేశ్వర్ శుక్ర, శనివారాల్లో దిల్లీలో సోనియా, రాహుల్ గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌లతో మంతనాలు జరిపారు. తన ప్రతిపాదనలకు సోనియా శనివారం ఆమోదం తెలిపారని, ఒకటి రెండు రోజుల్లో కొత్త మంత్రివర్గం జాబితాను గవర్నర్‌కు సమర్పిస్తానని సిఎం తెలిపారు. వృద్ధాప్యం, అసమర్ధత, అవినీతి ఆరోపణల కోణంలో కొంతమందిని క్యాబినెట్ నుంచి తప్పించి, కనీసం 10 నుంచి 14 మందికి కొత్తగా మంత్రి పదవులను కేటాయించాలని సిఎం యోచిస్తున్నారు. అనుభవజ్ఞులకు, యువ ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన భావిస్తున్నారు.