జాతీయ వార్తలు

కావేరి జలాల వివాదంలో కర్నాటకకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కావేరీ నదీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తమిళనాడుకు 177 టీఎంసీలు ఇవ్వాలని కర్నాటకకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదానికి సంబంధించి 2007లో 192 టీఎంసీలు తమిళనాడు వాటాగా పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ కావేరీ నదీ జలాల పంపిణీపై తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కర్నాటక ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేశాయి. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం తాజాగా తమిళనాడు వాటాను 177 టీఎంసీలకు తగ్గిస్తూ నేడు తీర్పును వెలువరించింది. తమిళనాడుకు వాటా తగ్గింపుతో కర్నాటకకు అదనంగా 14.75 టీఎంసీల నీరు రానుంది.