సాహితి

ఖాళీగా లేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటల్ని వెతుక్కుంటున్నాను
మనసు నిండా మాట్లాడ్డం బందై
చాలాకాలమైంది

అట్లని వౌనం పందిరి కింద
నేనేమీ ఖాళీగా లేను

సముద్రపు అలల అంచుల్లోని
మీగడలాంటి నురగని
దోసిట్లోకి తీసుకుని ముద్దాడుతున్నాను

ఆకాశం కాన్వాస్‌పై
మబ్బులు వేస్తున్న
రంగుల చిత్రాల్ని
ఆస్వాదిస్తున్నాను

చెట్ల చిగురుటాకుల్లోని స్వచ్ఛతనీ
సున్నితత్వాన్ని అవలోకిస్తున్నాను

వౌనం పందిరి కింద
నేనేమీ ఖాళీగా లేను

తప్పిపోయిన మనిషిని,
మనిషితనాన్ని
వెతుక్కుంటున్నాను
ఆశగా ఆతృతగా..

- వారాల ఆనంద్