జాతీయ వార్తలు

ఇది తెలంగాణ ప్రజల విజయం: కేసీఆర్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: టీఆర్ఎస్ విజయం పూర్తిగా తెలంగాణ ప్రజల విజయమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుపేద, వెనకబడినవర్గాలు.. సకల జనులు నిండుగా దీవించి అందించిన విజయమని చెప్పారు. విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలన్నారు. రైతుల కోసం పని చేస్తాం. గిరిజనులు, గిరిజనేతరులు పడుతున్న భూ హక్కుల విషయాన్ని వీలైనంత త్వరగా సత్వర పరిష్కారం చేస్తాం. కులవృత్తులు కుదుటపడేలా చేస్తాం. యువతకు ఉపాధి, ఉద్యోగాలు విరివిగా లభించే విధంగా ముందుకెళ్తాం. ఉద్యోగ ఖాళీలన్నీంటిని వీలైనంత త్వరగా భర్తీ చేస్తామన్నారు. కాళేశ్వరం పూర్తి చేసి, కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తానని స్పష్టం చేశారు.