ఖమ్మం

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జూలై 23: గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని, ఈ విషయంలో గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక చొరవ తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు క్రీడా మినీ అకాడమీలు ఏర్పాటు చేసిందని ఐటీడీఏ పీవో పమేలా సత్పతి పేర్కొన్నారు. ఈ అకాడమీల్లో గిరిజన విద్యార్థులను తీర్చిదిద్దేలా తగిన తర్ఫీదు ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా చర్యలు చేపట్టడం అభినందనీయమని ఆమె అన్నారు. భద్రాచలంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ప్రాంగణంలో సోమవారం ఆర్చరీ అకాడమీని స్థానిక ఎమ్మెల్యే సున్నం రాజయ్యతో కలిసి జెండా ఆవిష్కరించి పీవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారిణి మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మూడు క్రీడా మినీ అకాడమీలు మంజూరయ్యాయన్నారు. భద్రాచలంలో ఆర్చరీ, సుదిమళ్ళలో బ్యాట్మింటన్, కినె్నరసానిలో వాలీబాల్ అకాడమీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు నిపుణులు తర్ఫీదునిస్తారన్నారు. భద్రాచలం గురుకులంలో శాశ్వతంగా ఆర్చరీ అకాడమీని ఏర్పాటు చేసి ఆర్చరీలో నైపుణ్యాలను నేర్పించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించేలా చర్యలు తీసుకొంటామని తెలిపారు. ఏజెన్సీలో ఇప్పటికే అనేక మంది గిరిజన విద్యార్థులు విలువిద్యలో ప్రావీణ్యాన్ని ప్రదర్శించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించారని, నూతనంగా ఈ అకాడమీల ఏర్పాటు ద్వారా ఏజెన్సీ విద్యార్థులు నైపుణ్యం సాధించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు కృషి జరుగుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ప్రావీణ్యం పొందేలా గిరిజన సంక్షేమశాఖ అవిరల కృషి చేస్తుందని అన్నారు. గతంలో గిరిజనుడైన మిడియం బొజ్జి ఆర్చరీలో అంతర్జాతీయ స్థాయిలో రాణించి ప్రభుత్వ ఉద్యోగం పొందాడని, బొజ్జితో పాటు మారప్ప, పద్దం ప్రసాద్, మరో 15 మంది ఆర్చరీ క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కినె్నరసాని క్రీడా పాఠశాలను ఇంకా అభివృద్ధి చేయాలన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతూ క్రీడల్లో రాణించే విద్యార్థులకు ప్రభుత్వ రాయితీలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గురుకులం కోఆర్డినేటర్ బురాన్, సర్పంచి భూక్యా శే్వత, జడ్పీటీసీ రవికుమార్, ఎంపీపీ ఊకే శాంతమ్మ, ప్రిన్సిపాల్ దేవదాసు, ఆర్చరీ రూపకర్త పుట్టా శంకరయ్య, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్ ప్రజావ్యతిరేక పాలనను అంతంచేయాలి
* సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు పోటు ప్రసాద్
చింకతాని, జూలై 23: టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనను అంతం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పోటు ప్రసాద్ ప్రజలకు పిలుపు నిచ్చారు. ప్రజాసమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తు సోమవారం తహశీల్ధార్ కార్యాలయం సిపిఐ మండల కమిటీ ఆద్వర్యంలో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నిక సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైనారని, రాష్ట్రంలో రాక్షసపాలన కొనసాగుతున్నదని ఆరోపించారు. దళితులకు మూడెకరాలు, అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు ఎందుకు ఇవ్వలేదో కెసిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనుడు కెసిఆర్ అని విమర్శించారు. ప్రజామస్యలపై ఉద్యమాలు చేస్తున్న వారికి పోలీసులను అడ్డంపెట్టుకుని అక్రమకేసులు బనాయిస్తూ ప్రభుత్వం నియతృత్వంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రైతుబంధు పథకం కౌలు రైతులకు వర్తించకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు రైతులు రైతులు కాదా అని ప్రశ్నించారు. వ్యవసాయ రంగాన్ని నర్వీర్యం చేస్తూ , అన్నదాతలను అడ్డంగా మోసం చేస్తున్న ప్రభుత్వం తగిన మూల్యం చెల్లింకోకతప్పదన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై సిపిఐ నిరంతరం ప్రజా ఉద్యమాలు చేపడుతుందని స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్ పాలనను అంతం చేయడంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు సిద్దంగా ఉండాలన్నారు. అనంతరం ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహశీల్ధార్ శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సిపి మండల కార్యదర్శి పావులూరి మల్లిఖార్జున్, జిల్లా కార్యవర్గ సభ్యులు జమ్ముల జితేందర్‌రెడ్డి, దూసరి శ్రీరాములు, కొండపర్తి గోవిందరాలు, నాయకులు దూసరి గోపాలరావు, అబ్బూరి మహేష్, నారపోగు బాలస్వమి, కూచిపుడి రవి, చాట్ల సురేష్, వివిధ గ్రామాలకు చెందిన గ్రామశాఖ కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.