ఖమ్మం

రైతులకు భూమిపై హక్కు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూలై 23: రైతులకు భూమిపై హక్కు కల్పించేంత వరకు ఉద్యమిస్తామని తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద నిర్వహించిన రైతుదీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులకు వ్యవసాయం చేసుకునేందుకు భూమిపై హక్కుకల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అటవీహక్కుల చట్టం ప్రకారం పాసుపుస్తకాలు పొందిన రైతులను ఇబ్బందులకు గురిచేయడం మంచిదికాదన్నారు. సాదాబైనామా ఉన్న రైతులందరికీ చట్టప్రకారం పాసుపుస్తకాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం చేస్తున్న రైతులను గౌరవంగా చూడాల్సిన బాధ్యత పాలకప్రభుత్వాలపై ఉందన్నారు. సంప్రదాయ పద్ధతిలో వచ్చిన భూమిని అనుభవించే అధికారం రైతుకు ఉందన్నారు. భూరికార్డుల ప్రక్షాళనలో జరిగిన తప్పులను యుద్ధ ప్రాతిపదికన సరిచేసి రైతులకు కొత్త పాసుపుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తప్పులమూలంగా రైతులకు చెక్కులు అందని పరిస్థితి ఉందని తెలిపారు. రైతు బీమా పథకాన్ని వ్యవసాయం చేసుకుంటున్న రైతులందరికీ వర్తింపచేయాలన్నారు. పోడుభూములు, సీలింగ్‌భూములు ఉన్న రైతులు సాదాబైనామ కలిగివుండి యాజమాన్య హక్కులతో వ్యవసాయం చేసుకుంటున్నారని, వారందరికి పాసుపుస్తకాలను పంపిణీ చేయాలన్నారు. అటవీహక్కు యాజమాన్య చట్టం ప్రకారం వ్యవసాయం చేసుకుంటున్న రైతులను ఇబ్బందులకు గురిచేసే ఆలోచనను విరమించుకోవాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పోడువ్యవసాయం చేసుకుంటున్న రైతులకు సైతం పాసుపుస్తకాల పంపిణీ చేసి రైతుభీమా పథకాన్ని అమలుచేయాలన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వానికి మంచిదికాదన్నారు. సాంప్రదాయ హక్కులు కలిగిన రైతులకు చట్టబద్దమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుకు అందజేశారు. రైతుదీక్ష కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం పట్టణంలో భారీ వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో తెలంగాణ జనసమితి జిల్లా ఇన్‌చార్జ్ గోపగాని శంకర్‌రావు, యూత్ కోఆర్డినేటర్ ఎస్‌డి సలీమ్‌పాషా, విద్యార్థి జనసమితి కోఆర్డినేటర్ కిరణ్‌కుమార్, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జ్ పంపన శివప్రసాద్, జిల్లా కన్వీనర్ మల్లెల రామనాధం, యూత్ కోఆర్డినేటర్ వల్లాల భరత్, నాయకులు గుడివాడ రామలక్ష్మణ్, కుడికాల ఆంజనేయులు, అమ్మ మహేష్, పాండవుల భిక్షం, ఎంజాల శివరామప్రసాద్, జనపరెడ్డి కోటేశ్వరరావు, శ్రీనివాస్, భూక్య రవినాయక్, పగడాల కరుణాకర్‌రెడ్డి, జనార్ధన్, మడకం ప్రసాద్, ఎస్‌కె గౌస్, ఎండ్యాల కృష్ణ, దొడ్డా సింగమ్మ, తదితరులు పాల్గొన్నారు.