ఖమ్మం

ఉగ్ర పాకిస్తాన్‌కు బద్ధి చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారేపల్లి, సెప్టెంబర్ 19: కాశ్మీర్‌లో పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాద చర్యలకు తగిన బుద్ధి చెప్పాలని బిజెపి జిల్లా నాయకులు ఆదెర్ల ఉపేందర్ ప్రభుత్వాన్ని కోరారు, కాశ్మీర్ ఘటనలో అమరవీరులైన వీర జవాన్లకు సోమవారం స్థానిక బిజెపి శాఖ శ్రద్ధాంజలి ఘటించింది. ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ భారత్ ఎంత ఓపిక ప్రదర్శించినా పాక్ కవ్వింపు చర్యలు విడనాడటం లేదని, కాశ్మీర్ సైనిక శిబిరంపై దాడి ఘటనతో అది మరింత బహిర్గతమయిందని అన్నారు. ప్రజలంతా ఈ దాడిని ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండలాధ్యక్షులు తురక నారాయణ తదితరులు పాల్గొన్నారు.
నేలకొండపల్లిలో
వీర జవాన్లకు
ఘన నివాళులు
నేలకొండపల్లి, సెప్టెంబర్ : జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులలో వీర మరణం చెందిన జవాన్‌లకు ఘనంగా నివాళులర్పించారు. నేలకొండపల్లి పోట్టిశ్రీరాముల సెంటర్ నందు బిసి యూత్ ఆధ్వర్యంలో సోమవారం వీర జవాన్ల మృతికి కొవ్వత్తులతో ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో నేలకొండపల్లి ఎస్‌ఐ సుమన్, పోలీసు సిబ్బంది, అంజని, పవన్, శ్వామ్, శ్రీకాంత్, సోందు, నర్సింహరావు, శంకర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
ఉగ్రవాద దిష్టిబొమ్మ దగ్ధం
ఖమ్మం(గాంధీచౌక్), సెప్టెంబర్ 19: జమ్ము కాశ్మీర్‌లోని యూరి సెక్టర్‌లో ఆదివారం జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నాగేశ్వరరావు, బషిరుద్దీన్ మాట్లాడుతూ ఉగ్రవాదం ప్రజాస్వామ్యానికి పెనుముప్పని, దానిని నివారించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చర్యకు పాల్పడిన వారికి కఠిన శిక్షించాలన్నారు. నిద్రలో ఉన్న సైనిక స్థావారాలపై దాడి చేయటం అత్యంత దుర్మర్గ చర్య అని అన్నారు. ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలను అర్పించిన సైనికులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉపేందర్, రాంబాబు, రాజశేఖర్, శ్రీను, మంగపతి, రాజు, ఆశోక్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.