ఖమ్మం

ఉద్యోగులు పారదర్శకంగా పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), సెప్టెంబర్ 19: విద్యుత్ ఉద్యోగులు తమ విధులను పారదర్శకంగా నిర్వహించాలని, విద్యుత్ సమస్యలను పరిష్కరించటంతో పాటు రెవెన్యూను పెంచాలని విద్యుత్‌శాఖ వరంగల్ రేంజ్ సిఎండి వెంకటనారాయణ పేర్కొన్నారు. సోమవారం స్థానిక విద్యుత్ విశ్రాంతి భవనంలో ఉద్యోగులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువగా ట్రాన్స్‌ఫార్మర్స్ ఫెయిల్యూర్ అవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అలా అయిన వాటి స్థానంలో క్వాలిటీ ఉన్న నూతన ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలన్నారు. పాత ట్రాన్స్‌ఫార్మర్లకు వెంటనే మరమ్మతులు నిర్వహించాలని అదేశించారు. అలాగే విద్యుత్ లైన్‌లను లాగటంలో ఖచ్చితమైన నిబంధనలను పాటించి లైన్‌లాస్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నూతన మీటర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే నూతన మీటర్లను ఏర్పాటు చేయాలని, ఇప్పటికి ఉన్న పాత మీటర్లను తొలగించి స్కానింగ్ మీటర్లను ఏర్పాటు చేయాలని, మీటర్ల సేల్స్‌ను పెంచాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఖరీఫ్‌కు విద్యుత్ సరఫరాలో ఎటువంటి అటంకాలు లేకుండా సరఫరా చేయాలని, వచ్చే రబీలో 9 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేసుకొని వాటి సమస్యలను పరిష్కరించుకోవాలని సూ చించారు. రైతులు విద్యుత్ సమస్యలపట్ల ఏమైనా ఫిర్యాదు చేస్తే వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని అదేశించారు. వరంగల్ రెంజ్ పరిధిలో ఉన్న జిల్లాలలో ఖమ్మం జిల్లా ముందంజలో ఉందని దానిని మరింత బలపరిచేలా అధికారులు కృషి చేయాలన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ మీటర్లకు వెంటనే సీల్ వేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం వస్తున్న రెవెన్యూ కంటే ఎక్కువ రెవెన్యూ వచ్చాలా కృషిచేయాలన్నారు.ఈ సమావేశంలో డ్రైరెక్టర్ ఆఫ్ ప్రాజెక్టర్ బుగ్గవీటి వెంకటేశ్వరరావు, ఎస్‌ఇ కె రమేష్, డిఇటి నాగప్రసాద్, ఖమ్మం డిఇ రవికుమార్, కమర్షియల్ ఎడి నందన్, సత్తుపల్లి డిఇ సురేందర్, ఖమ్మం టౌన్ ఎడి బాలాజీ, డిఇలు, ఎడిలు, ఎఇలు పాల్గొన్నారు.