ఖమ్మం

వర్తకసంఘం ఎన్నికల్లో కొప్పు ప్యానల్‌కే ప్రధాన పదవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), సెప్టెంబర్ 19: వర్తకసంఘం ఎన్నికల్లో కొప్పు నరేష్ ప్యానల్ పూర్తి స్థాయిలో మెజార్టీని కనబరిచింది. వర్తక సంఘం అధ్యక్షుడిగా కొప్పు నరేష్ విజయం సాధించగా, కార్యదర్శిగా గుడవర్తి శ్రీనివాసరావు గెలుపొందారు. ప్రధాన శాఖలతో పాటు వర్తక సంఘం అధ్యక్ష, కార్యదర్శి, ఉపాధ్యక్ష పదవులను కొప్పు ప్యానల్ గెలుచుకోవడంతో వారి మద్దతుదారుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిసాయి. ఆదివారం జరిగిన వర్తక సంఘం ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఎన్నికల అధికారులు పూర్తి ఫలితాలను అర్ధరాత్రి 2 గంటల వరకు వెలువరించారు. ఫలితాల కోసం అభ్యర్థులు, మద్దతుదారులు, వ్యాపారులు ఆసక్తిగా ఎదురు చూడడంతో చాంబర్ వద్ద ఉత్కంఠవాతావరణం నెలకొంది. ఫలితాలు కొప్పు నరేష్ ప్యానల్‌కు అనుకూలంగా రావడంతో వ్యాపారులంతా సంబురాలు జరుపుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ఉపాధ్యక్షుడుగా కురువెళ్ళ ప్రవీణ్, సహాయ కార్యదర్శిగా పత్తిపాక రమేష్‌లు ప్యానల్ నుండి గెలవడంతో మద్దతుదారులంతా వర్తక సంఘం వద్ద కేరింతలతో నృత్యాలు చేశారు. వర్తకసంఘం అధ్యక్ష పదవి కోసం పోటీలో నిలిచిన మేళ్ళచెరువు వెంకటేశ్వరరావు గట్టి పోటీ ఇస్తాడని కొప్పు వర్గం భావించినా ఫలితాలు కొప్పుకు అనుకూలంగా రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రధాన శాఖలో కోశాధికారిగా తూములూరి లక్ష్మీనరసింహరావు మేళ్ళచెరువు ప్యానల్ నుండి గెలుపొందారు.
విజయోత్సవ ర్యాలీ
వర్తక సంఘంలోని ప్రధానశాఖలోని అధ్యక్ష, కార్యదర్శి, ఉపాధ్యక్ష, సహాయ కార్యదర్శి పదవులతో పాటు ఇతర ప్రధాన శాఖలను కైవసం చేసుకోవడంతో కొప్పు ప్యానల్ మద్దతుదారులు సోమవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. గెలుపొందిన అభ్యర్థులతో కలిసి మార్కెట్ యార్డు నుండి పొట్టిశ్రీరాముల రోడ్డు, ట్రంకురోడ్డు, గాంధీచౌక్ మీదుగా వర్తక సంఘం కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా గెలుపొందిన అభ్యర్థులు మాట్లాడుతూ తమకు మద్దతు తెలిపి తమ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. వ్యాపారాలలో ఎలాంటి సమస్యలు తలెత్తిన ముందుండి పరిష్కరించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.