ఖమ్మం

అభివృద్ధికే పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, సెప్టెంబర్ 23: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికే పెద్దపీట వేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం కూసుమంచి మండలంలోని రాజుతండా నుంచి ఒంటిగూడిసెతండా వరకు 130లక్షల వ్యయంతో నిర్మించనున్న బిటి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా ఒక్కొక్క పనిని పూర్తి చేస్తూ అన్ని రంగాల్లో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రోడ్డును త్వరిగతిన పూర్తి చేసి ప్రజల సౌకర్యవంతంగా చూడాలన్నారు. రహదారి నిర్మాణంలో లోపాలు తలెత్తితే వారిపై కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా వర్షాలు విస్తారంగా కురుస్తున్న అధికారులు గ్రామాల్లో సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు, జడ్పీటిసి రామచంద్రు పాల్గొన్నారు.