ఖమ్మం

ఎలాంటి నష్టం జరగనివ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, సెప్టెంబర్ 23: జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మునే్నరు పొంగి పొర్లుతుందని, ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం రాత్రి నగరంలోని మునే్నటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మునే్నటి భారీగా వరద నీరు చేరిందని, అధికారులు ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి వెంట డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు, ఖమ్మం మేయర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీప్రసాద్, ఆర్డీవో వినయ్‌కృష్ణారెడ్డి, తహశీల్దార్ శ్రీలత, ఖమ్మం నగర కమిషనర్ బొనగిరి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
కలెక్టరేట్‌లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు
ఖానాపురం హవేలి, సెప్టెంబర్ 23: జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏమైనా సమస్యలు ఉంటే తెలియచేసేందుకుగాను జిల్లా కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నెంబర్ 08742-238222ని ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ లోకేష్‌కుమార్ వెల్లడించారు. ప్రజలు అందించిన సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారని, ఈ టోల్‌ఫ్రీ నెంబర్‌లో 24గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.