ఖమ్మం

మరో కార్యాలయం కొత్తగూడెం తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, సెప్టెంబర్ 23: రాష్ట్ర విభజన సమయం నుంచి షాకుల మీదు షాకులు తింటున్న భద్రాచలం ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో ఝలక్ ఇచ్చింది. ఇప్పటికే ఆర్‌అండ్‌బి, నీటిపారుదల...వంటి కీలక కార్యాలయాలను భద్రాచలం నుంచి తరలించుకు పోయిన ప్రభుత్వం తాజాగా నూతనంగా ఆవిర్భవించనున్న కొత్తగూడెంకు మరో కార్యాలయాన్ని కూడా తరలించుకు పోయేందుకు రంగం సిద్ధం చేసింది. సహకార శాఖ విభాగ సహకార అధికారి(డిఎల్‌సిఓ) కార్యాలయాన్ని కొత్తగూడెం తరలించనున్నారు. ఈ నెల వరకే భద్రాచలంలో కార్యకలాపాలు నిర్వహించి వచ్చే నెలలో కొత్తగూడెం కేంద్రంగా పనులు చేపట్టాలని ఆదేశించినట్లుగా సమాచారం. భద్రాచలంలో డివిజనల్ కో ఆపరేటివ్ కార్యాలయాన్ని 1972లో ఏర్పాటు చేశారు. ప్రాథమిక సహకార సంఘాలు, ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలు, లేబర్ కాంట్రాక్టు సొసైటీలు, ఇసుక సొసైటీలు, ఇతర సొసైటీలు ఈ కార్యాలయం పరిధిలోకి వచ్చేవి. డిఎల్‌సిఓతో పాటుగా 17 మంది ఉద్యోగులు ఇక్కడ వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. జిల్లాకు ఒకే కార్యాలయం ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ కార్యాలయాన్ని కొత్తగూడెం జిల్లాలోని కార్యాలయంలో విలీనం చేస్తున్నారు. నాలుగు దశాబ్ధాలుగా భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లోని 10 సహకార సంఘాలు, 20 ఇసుక సహకార సంఘాలు, జాయింట్ ఫార్మింగ్ సొసైటీలు ఈ కార్యాలయం పరిధిలో ఉన్నాయి.