ఖమ్మం

జోరువాన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 23: అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జోరువాన కురిసింది. ఖమ్మం నగరంతో పాటు పలు మండలాల్లో కుండపోతగా వర్షం పడడంతో జిల్లాలోని చెరువులు, వాగులు, ప్రాజెక్టులు నిండి ప్రవహిస్తున్నాయి. జిల్లాలో అత్యధికంగా టేకులపల్లి మండలంలో 110.4 మిల్లిమిటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా మధిర మండలంలో 1.8 మిల్లిమిటర్ల వర్షపాతం నమోదు అయింది. గురువారం రాత్రి నుండి పడుతున్న వర్షంతో జిల్లాలోని కినె్నరసాని ప్రాజెక్టు నిండడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. చతీస్‌ఘడ్‌లో కురుస్తున్న వర్షలాకు తాలిపేరుకు భారీగా వరద నీరు చేరుతుండడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అందరిని అప్రమత్తం చేస్తున్నారు. కొణిజర్ల మండలంలోని మసివాగు జోరు వానకు పొంగిప్రవహిస్తుంది. కాగా ఇల్లెందు, బయ్యారం మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు నిండి అలుగులు పడడంతో ఆ నీరంతా మునే్నటికి చేరుతుంది. బయ్యారం పెద్ద చెరువు నిండి అలుగు పడి మునే్నటికి నీరు రావడం, అటు వరంగల్‌లో కురుస్తున్న వర్షాలకు పాకాలేరు నుండి మునే్నటికి భారీగా నీరు చేరుతుండడంతో ఖమ్మంలో మునే్నరు ఉధృతంగా ప్రవహిస్తుంది. మునే్నటి నుండి 1000 క్యూసెక్కులకు పైగా నీరు కృష్ణనదికి చేరుతుంది. ఇదిలా ఉండగా రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ఇల్లెందు తహశీల్దార్ పూరతన కార్యాలయం పై కప్పు కూలింది. అశ్వారావుపేట మండలంలో 28 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి పలు గ్రామాలు అంధకారంలోకి వెళ్ళాయి. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు బొగ్గు ఉత్పత్తులు నిలిచిపోయాయి.
శుక్రవారం జిల్లాలో కురిసిన వర్షపాతం మిల్లిమిటర్లలో మండలాల వారీగా కింది విధంగా ఉంది.

మండలం వర్షపాతం
-------------------------------------
1 వాజేడు 5.2
2 వెంకటాపురం 49.2
3 చర్ల 47.2
4 పినపాక 39.8
5 గుండాల 65.0
6 మణుగూరు 70.8
7 అశ్వాపురం 62.0
8 దుమ్ముగూడెం 85.4
9 భద్రాచలం 63.2
10 బూర్గంపాడు 55.4
11 పాల్వంచ 58.2
12 కొత్తగూడెం 70.2
13 టేకులపల్లి 110.4
14 ఇల్లెందు 77.2
15 సింగరేణి 37.6
16 బయ్యారం 46.0
17 గార్ల 34.2
18 కామేపల్లి 17.0
19 జూలూరుపాడు 62.4
20 చండ్రుగొండ 30.4
21 ములకలపల్లి 55.8
22 అశ్వారావుపేట 91.2
23 దమ్మపేట 45.8
24 సత్తుపల్లి 24.6
25 వేంసూరు 18.4
26 పెనుబల్లి 14.6
27 కల్లూరు 10.4
28 తల్లాడ 7.4
29 ఏన్కూరు 50.2
30 కొణిజర్ల 8.8
31 ఖమ్మం అర్బన్ 8.2
32 ఖమ్మం రూరల్ 14.2
33 తిరుమలాయపాలెం 9.6
34 కూసుమంచి 48.4
35 నేలకొండపల్లి 14.4
36 ముదిగొండ 12.8
37 చింతకాని 14.8
38 వైరా 8.4
39 బోనకల్ 22.4
40 మధిర 1.8
41 ఎర్రుపాలెం 2.4