ఖమ్మం

కొలిక్కి వచ్చిన లెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, సెప్టెంబర్ 25: జిల్లాల పునర్విభజనలో భాగంగా రెండుగా చీలనున్న ఖమ్మం జిల్లాలో ఖమ్మంతో పాటుగా, నూతన జిల్లా కొత్తగూడెం లెక్కలు ఒక కొలిక్కి వచ్చాయి. జనాభా మొదలు అక్షరాస్యత, పాడి పంటలు, భూములు, పరిశ్రమలు, గనులు, విద్య, వైద్యం తదితర అన్ని రంగాల లెక్కలు తేల్చేశారు. 22 మండలాలు, 21 మండల పరిషత్‌లతో 4595 చదరపుకిలోమీటర్ల విస్తీర్ణంలో ఖమ్మం, 18 మండల పరిషత్‌లు, 18 మండలాలతో 8284 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో నూతనంగా కొత్తగూడెం జిల్లా ఆవిర్భవిస్తున్నాయి.
కొత్తగూడెం
8284 చదరపుకిలోమీటర్ల విస్తీర్ణంలో 502 రెవిన్యూ గ్రామాలు, 211 పంచాయితీలు, 18 మండలాలు, 18 మండల పరిషత్‌లతో ఆవిర్భవిస్తున్న కొత్తగూడెం జిల్లా జనాభా 10,92, 447గా తేల్చారు. 2, 86, 030 గృహసమదాయాలు ఉండగా జన సాంద్రత చదరపు కిలోమీటర్‌కు 449, జనాభా వృద్ధిరేటు 8.47గా పేర్కొన్నారు. ఆరు సంవత్సరాల లోపు పిల్లలు 1,14,626 మంది, విద్యావంతులు 6,52,446, అక్షరాస్యతాశాతం 62.26శాతంగా గణన చేశారు. ఎస్సీ జనాభా 1,49,179, ఎస్టీ జనాభా 3,99,510గా వివరించారు. కొత్తగూడెం జిల్లాలో సాధారణ వర్షపాతం 21661 మిల్లీ మీటర్లుగా పేర్కొనగా ఇప్పటి వరకు 17325 మిల్లీ మీటర్లు మాత్రమే కురిసినట్లుగా గణాంకాలు తెలుపుతున్నాయి. వ్యవసాయానికొస్తే సాధారణ సాగు 1,46, 681 హెక్టార్లు కాగా 1,34,457 హెక్టార్లలోనే సాగు చేస్తున్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి. సాగునీటి వసతి 48,728 హెక్టార్లకు మాత్రమే ఉంది. ఇక్కడ వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసలు, మినుములు, శనగ, వేరుశనగ, మిర్చి, చెరకు, పత్తి, పొగాకు సాగు చేస్తారు. పశువులు 2,32, 814 ఉన్నట్లు గణన చేశారు. డిగ్రీ కళాశాలలు 36, జూనియర్ కళాశాలలు 57, ప్రభుత్వ పాఠశాలలు 1702, ఇంజనీరింగ్ కళాశాలలు 5, పాలిటెక్నిక్ కళాశాలలు 3 ఉన్నాయి. డిగ్రీ విద్యార్ధులు 14259 మంది, జూనియర్ కళాశాల విద్యార్ధులు 12540, పదో తరగతి లోపు విద్యార్ధులు 1,72, 228 మంది ఉన్నట్లుగా లెక్కలు తేల్చారు.
ఖమ్మం జిల్లా
ఖమ్మం జిల్లాలో 4595 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 399 రెవిన్యూ గ్రామాలు, 439 గ్రామపంచాయితీలు, 22 రెవిన్యూ మండలాలు, 21 మండల పరిషత్‌లు ఉంటాయి. జిల్లా జనాభా 14,35,034 కాగా ఇక్కడ 3,91,916 గృహసముదాయాలు ఉన్నట్లుగా లెక్కించారు. జనసాంద్రత చదరపుకిలోమీటర్‌కు 310 మంది కాగా జనాభా వృద్ధిరేటు 8.47 అని తేల్చారు. ఆరేళ్లలోపు చిన్నారులు 1,43,205 మంది ఉండగా విద్యావంతులు 8,49,136 మంది ఉన్నారు. ఈ జిల్లా అక్షరాస్యత 62.26శాతం. ఎస్సీ జనాభా 2,82,486, ఎస్టీల జనాభా 2,16,631 మంది. జిల్లాలో సాధారణ వర్షపాతం 21747 మిల్లీమీటర్లు. పడిన వర్షపాతం 15130.6 మిల్లీమీటర్లు మాత్రమే. వ్యవసాయానికొస్తే సాధారణ సాగు 1,57,030 హెక్టార్లు. సాగు విస్తీర్ణం మాత్రం 1,43,247హెక్టార్లు మాత్రమే. సాగునీటి వసతి మాత్రం కేవలం 61882 హెక్టార్లకు ఉంది. వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసలు, మినుములు, శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, మిర్చి, ఉల్లి, చెరుకు, పత్తి, పొగాకు పంటలు ఇక్కడ సాగవుతాయి. 2,24,742 పశుసంపద ఉన్నట్లుగా తేల్చారు. డిగ్రీ కళాశాలలు 38, జూనియర్ కళాశాలలు 86 ఉన్నాయి. డిగ్రీ విద్యార్థులు 22,547, జూనియర్ కళాశాల విద్యార్ధులు 21,997, పదోతరగతి లోపు విద్యార్థుల సంఖ్య 2,30,197గా అధికారులు గణన పూర్తి చేశారు.