ఖమ్మం

పండిట్ దీన్‌దయాళ్‌కు ఘన నివాళులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(జమ్మిబండ), సెప్టెంబర్ 25: పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను ఆదివారం బిజెపి నగర శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు దీన్‌దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికే వనె్నతెచ్చిన దీన్‌దయాళ్‌ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, శ్రీనివాస్, సైదావళి, బాబు, నాగమణి, ప్రసాద్, వెంకటేశ్వర్లు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
జూలూరుపాడులో...
జూలూరుపాడు: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ శత జయంతి వేడుకలను ఆదివారం జూలూరుపాడులో ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయ చిత్రపటానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గసభ్యులు చిలుకూరి రమేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దీన్‌దయాల్ ఉపాధ్యాయ గొప్ప దార్శనికుడని అయన గొప్పతనాన్ని గుర్తుచేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌లో పనిచేశారన్నారు. పంచజన్య, రాష్టధ్రర్మ, స్వదేశీ మొదలైన మాస, దిన పత్రికల సంపాదకునిగా కూడా పనిచేశారని తెలిపారు. ఇంతే కాకుండా చంద్రగుప్త చాణక్య, ఏకాత్మత, మానవాతవాదంపై పలు గ్రంధాలను కూడా ఉపాధ్యాయ రచించారని కొనియాడారు. ఈకార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శిరిపురపు ప్రసాద్, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు నర్వనేని శిరీష, ఉపాధ్యాక్షులు పుల్లారావు, నాయకులు కొమ్మినేని లక్ష్మణ్, పూరేటి వెంకటేశ్వర్లు, గోపాలరావు, నవీన్, దర్శినాల కృష్ణ, నందులాల్, నాగమణి పాల్గొన్నారు.
మర్లపాడులో...
వేంసూరు: మండలంలోని మర్లపాడు గ్రామంలో బిజెపి ఆధ్వర్యంలో పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్య శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిధి బిజెపి రాష్ట్ర కార్యవర్గసభ్యులు కూసంపూడి రవీంద్ర మాట్లాడుతూ దీన్‌దయాళ్ మానవతావాది గొప్ప సంఘ సంస్కర్తఅని దీన్‌దయాళ్ ఉపాధ్య పేరుమీద కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. ఈకార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు నల్లగొండ్ల అంజిరెడ్డి జిల్లాకార్యవర్గసభ్యులు ద్డొపునేని క్రిష్ణయ్య, కిసాన్‌మోర్చా రాష్ట్ర నాయకులు దుగ్గిఅప్పిరెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చల్లాఅప్పిరెడ్డి, భాస్కరాచారి, వీరంరాజు, హరీష్ రెడ్డి, కిషోర్, నియోజక వర్గ అధ్యక్షుడు బాలక్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.పంట నష్టంపై అంచనా వేసి పరిహారం అందించాలి
గార్ల, సెప్టెంబర్ 25: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టంపై ప్రభుత్వం సమగ్ర సర్వే జరిపి రైతులకు పరిహారం అందించాలని కాంగ్రెస్ పార్టీ ఇల్లందు ఎ బ్లాక్ అధ్యక్షుడు జర్పుల్ఘ భీముడునాయక్ డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వరద భీభత్సవం కారణంగా లోతట్టు, పాకాల పరివాహక ప్రాంతాలతోవరి, మెట్టలో పత్తి, పెసర, మొక్కజొన్న, మిర్చి పంటలు కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నీట మునిగి రైతులకు అపార నష్టం కలిగించిందన్నారు. వీటిపై సమగ్ర సర్వే జరిపించాలన్నారు. కాగా ఎడతెరిపి లేకుండ కురుస్తున్న వర్షాల వల్ల ఇళ్లు కూలీ అనేక మంది పేదలు నిరాశ్రయులుగా మారారని, వారందరికి పక్క గృహాలు మంజూరు చేయ్యాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ మండల కమిటి అధ్యక్షుడు పానుగంటి రాధాకృష్ణ, మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షంషాద్‌బేగం, నాయకులు కొనకంచి రామకృష్ణ, గుగులోతు శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఫ్యాన్సిజంపై హరికృష్ణకు వరల్డ్ రికార్డు
ఖమ్మం(గాంధీచౌక్), సెప్టెంబర్ 25: ఖమ్మం నగరానికి చెందిన బోయినపల్లి హరికృష్ణ ఫాన్సిజం సిద్ధాంతకర్తగా వరల్డ్‌రికార్డు సాధించారు. శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో వరల్డ్ రికార్డు బాధ్యులు ధనుష్‌జైన్, తెలుగు రాష్ట్రాల చీఫ్ కో అర్డినేటర్ బిఎం శివప్రసాద్ చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రం, జ్ఞాపిక, బంగారు పథకాన్ని హరికృష్ణ అందుకున్నారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ రక్తదాతగా, రచయితగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వండర్ బుక్, భారత్ వరల్డ్ రికార్డ్సులో నాలుగు రికార్డ్సులను సాధించినట్లు తెలిపారు. ఇకముందు కూడ ఇదే స్ఫూర్తితో రికార్డు సాధించేందుకు తాను ప్రయత్నిస్తానని ఆత్మవిశ్వసాన్ని వ్యక్తం చేశారు. స్పాన్సర్లు ముందుకు వచ్చినట్లయితే ఎవరెస్ట్ శిఖరంపై ఫ్యాన్సిజం జెండా ఎగరవేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు.