ఖమ్మం

పర్ణశాలలో నీట మునిగిన నారచీరెల ప్రదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుమ్ముగూడెం, సెప్టెంబర్ 27: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పర్ణశాల వద్ద గోదావరి పొంగి ప్రవహించడంతో ఆ నీరు సీతమ్మవాగు ద్వారా సీత నారచీరెల ప్రదేశాన్ని ముంచింది. గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు దుమ్ముగూడెం వద్ద గోదావరి నది నీటిమట్టం 16.2కు చేరింది. పర్ణశాలలోని సీతవాగు ద్వారా గోదావరి నీ ఎగపోటు వచ్చి సీత నారచీరెల ప్రదేశం మునిగింది. దీంతో అక్కడ ఉన్న సీతమ్మవారి విగ్రహాం, నారచీరెల ప్రదేశం, వామన గుంటలు తదితర చారిత్రక ఆనవాళ్లు ముంపునకు గురయ్యాయి. భక్తులు నారచీరెల ప్రదేశం నీటిలో ఉండటంతో చూడకుండానే వెనుదిరుగుతున్నారు. అలాగే 7 దుకాణాలు నీటిలో మునిగాయి. దుకాణదారులు తమ వస్తువులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అలాగే రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని చెరువులు, కుంటలు నిండుకున్నాయి. గుబ్బలమంగి ప్రాజెక్టులో భారీగా వరదనీరు చేరడంతో ప్రాజెక్టు అలుగు పోసి వరద నీరు రోడ్డుపైకి ప్రవహిస్తోంది. అలాగే గోదావరి ఎగువున ఉన్న ప్రాజెక్టులన్నీ నిండటంతో దిగువకు ఆ నీరు వదులుతున్నారు. దీంతో గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని సీడబ్య్లూసీ అధికారులు విలేఖర్లకు తెలిపారు. ఇదిలా ఉండగా ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు అంతా సిద్ధంగా ఉన్నట్లు తహసిల్దార్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఎప్పటికప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో మండల రెవెన్యూ అధికారులను పంపి పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు.