ఖమ్మం

రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన కస్తూరిబా విద్యార్థిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రుపాలెం, అక్టోబర్ 25: ఎర్రుపాలెంలోని కస్తూరిబాయి పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వేమిరెడ్డి శ్రావణి రాష్టస్థ్రాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఎస్ సరిత, పిఇటి విజయ మంగళవారం తెలిపారు. ఖమ్మంలో జరిగిన జిల్లాస్థాయి అండర్-14 ఖోఖో పోటీల్లో మండలం నుండి ఎంపికై జిల్లాస్థాయిలో మంచి ప్రతిభ కనబర్చడంతో రాష్టస్థ్రాయి ఖోఖో పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చిందని ప్రిన్సిపాల్ తెలిపారు. మంగళవారం పాఠశాలలో విద్యార్థినిని ప్రిన్సిపాల్ సరిత, పిఇటి విజయ, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.
రాష్టస్థ్రాయి అథ్లెటిక్స్‌లో హాజీబాబాకు
బంగారు పతకం
ఖమ్మం(జమ్మిబండ), అక్టోబర్ 25: నగరంలోని గట్టయ్యసెంటర్ కవితా డిగ్రీ అండ్ పిజి కాలేజీకి చెందిన ఎస్‌కె హాజీబాబాకు రాష్టస్థ్రాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో హైజంప్ విభాగంలో బంగారు పతకం సాధించారు. ఈ నెల 23,24 తేదీల్లో జెఎన్ స్టేడియం హన్మకొండలో నిర్వహించిన 3వ తెలంగాణ రాష్ట్ర ఓపెన్ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో బికామ్ కంప్యూటర్స్ మొదటి సంవత్సరం జరుగుతున్న ఎస్‌కె హాజీబాబా ప్రథమ స్థానం కైవసం చేసుకొని బంగారు పతకం సాధించాడని మంగళవారం ప్రిన్సిపాల్ డాక్టర్ సిహచ్ రాధాకృష్ణమూర్తి అభినందించారు.