ఖమ్మం

రైతులకు కనీస మద్దతు ధర కల్పించేలా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(జమ్మిబండ), అక్టోబర్ 25: రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం టిటిడిసి సమావేశ మందిరంలో డిఆర్‌డిఏ, మార్కెటింగ్, సివిల్‌సప్లయిస్, మార్కెటింగ్ ఏజన్సీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కొనుగోలు సీజన్ ప్రారంభం అవుతున్న దృష్ట్యా రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయమై చర్యలు చేపట్టాలన్నారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించి సిద్ధంగా ఉండాలన్నారు. పత్తి, వరిధాన్యం, మొక్కజొన్న పంటల దిగుబడికి అనుగుణంగా అవసరమయ్యే ఏర్పాట్లపై ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లాలో 65కేంద్రాలను ప్రారంభించామని, ఐకెపి ద్వారా 13, కోపరేటివ్ సొసైటీల ద్వారా 51 ఏర్పాటు చేస్తున్నామన్నారు. నవంబర్ మొదటి వారంలోగా అన్ని కేంద్రాల ద్వారా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లు, తేమశాతం నిర్థారించే మిషన్లను అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో డిఆర్‌డిఏ పిడి మురళీధర్‌రావు, ప్రసాద్‌రావు, సంధ్యారాణి, అప్పిరెడ్డి, మహేష్‌కుమార్, స్వరూపారాణి, రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.