ఖమ్మం

డిసెంబర్ 29 నుంచి శ్రీవైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, అక్టోబర్ 25: డిసెంబర్ 29 నుంచి 2017 జనవరి 18వ తేదీ వరకు దక్షిణ అయోధ్య శ్రీసీతారామచంద్రస్వామికి శ్రీవైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు దేవస్థానం స్థానాచార్యులు స్థలసాయి, ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబులు మంగళవారం ఉత్సవ తేదీలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసోత్సవాలు ప్రారంభవౌతాయని పేర్కొన్నారు. డిసెంబర్ 29 నుంచి అధ్యయనోత్సవాల్లోని పగల్‌పత్ ఉత్సవాల్లో భాగంగా శ్రీసీతారామచంద్రస్వామి భక్తులకు మత్స్య, కూర్మా, వరాహ, నృసింహ, వామన, పరశురామా, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణా అవతారాల్లో భక్తులకు దర్శనం ఇస్తారు. 2017 జనవరి 7న తిరుమంగై ఆళ్వార్ పరమపదోత్సవం నిర్వహించి సాయంత్రం గోదావరిలో శ్రీసీతారామచంద్రస్వామికి తెప్పోత్సవం చేస్తారు. దీంతో పగల్‌పత్ ఉత్సవాలు పూర్తవుతాయి. జనవరి 8న ఉదయం వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠరాముడు ఉత్తరద్వారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఆ రోజు రాత్రి నుంచి అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్ ఉత్సవాలు ప్రారంభవౌతాయి. 8న డిఎస్పీ కార్యాలయంలో, 9న అంబాసత్రంలో, 10న గోకులమండపం శ్రీకృష్ణదేవాలయంలో, 11న శ్రీరామదూత మండపం అభయాంజనేయస్వామి ఆలయంలో, 12న శ్రీగోవింద మండపం తాతగుడిలో, 13న పునర్వసు మండపంలో, 14న వేస్ట్‌ల్యాండ్‌లో, 15న కల్కి అవతారం, విశ్రాంతి మండపంలో, 16న దసరా మండపంలో, 17న నమ్మాళ్వార్ పరమ పదోత్సవం, 18న రెవిన్యూ మండపంలో రాపత్ ఉత్సవాల్లో భాగంగా స్వామి అక్కడ పూజలందుకుంటారు. జనవరి 19,20,21 తేదీల్లో స్వామి దమ్మక్క మండపం పురుషోత్తపట్టణంలో, నృసింహ మండపం గ్రామపంచాయితీ కార్యాలయంలో, వశిష్ఠ మండపం దేవస్థానం సిబ్బంది ఆధ్వర్యంలో విలాసోత్సవాలు జరుపుకుంటారు. జనవరి 24న స్వామికి విశ్వరూప సేవ నిర్వహించనున్నారు.