ఖమ్మం

ప్రతిపక్షాల ఆందోళనలకు స్పందించని పాలకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, అక్టోబర్ 25: ప్రభుత్వ విధానాలపై ఆరోపణలు గుప్పిస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలకు టిఆర్‌ఎస్ నేతలు స్పందించడం లేదు. దీంతో నకిలీ విత్తనాలతో పాటు జిల్లాల విభజన శాస్ర్తియంగా జరగలేదని, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలని, అర్హులైన వారందరికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇవ్వాలని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, పాఠశాలల్లో విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందించాలంటూ గత కొన్నిరోజులుగా ప్రతిపక్ష పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. జిల్లా కేంద్రాల్లో ప్రతినిత్యం ఈ కారణాలతో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. వీటికి ప్రజల నుంచి మద్దతు కూడా లభిస్తుంది. అయినప్పటికీ అధికార పార్టీ నేతలు మాత్రం స్పందించడం లేదు. కేవలం రాష్టమ్రంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లాకు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే నేతలు తమ పార్టీపై ఎదుటి పక్షాలు ఉద్యమం చేస్తున్నా స్పందించడం లేదు. ఒకరిద్దరు నేతలు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాలకే పరిమితమవుతున్నారు. ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి తీసుకొనిపోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతున్నా స్పందించిన దాఖలాలు లేవు. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలనను అందించేందుకు జిల్లాల విభజన చేపట్టిందనే విషయాన్ని ఉద్యోగులకు కూడా చెప్పలేకపోయారు. దీంతో ప్రభుత్వ విధానాల పట్ల వారుకూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొత్తగా ఏర్పడిన భద్రాద్రి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. మండలాల వారిగా ఆందోళనలు గుప్పిస్తున్నప్పటికీ ఆ పార్టీ నేతల్లో స్పందన కరవవుతుంది. రాష్టమ్రంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లాలో పర్యటించిన సమయంలో ఆయనతో పాటు గ్రామాల్లో తిరుగుతూ ఉండే నేతలు ప్రధాన సమస్యలపై ప్రతిపక్షాలు స్పందిస్తున్నా ఎందుకు స్పందించడంలేదని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు విషయంలో జరుగుతున్న తాత్సారాన్ని ప్రజలకు వివరించలేకపోతున్నారు. అలాగే కొత్త జిల్లాల ప్రాధాన్యతను చెప్పలేకపోతున్నారు. దీంతో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను అడ్డుకోలేకపోతున్నారు. ఇదే పరిస్థితి కొంతకాలం కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.