ఖమ్మం

దీపావళి బోనస్‌తో సింగరేణి కార్మికులకు ట్రిపుల్ ధమాకా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, అక్టోబర్ 25: సింగరేణి కార్మికులు దీపావళి బోనస్‌రూపంలో బుధవారం ఒక్కొక్కరు రూ 54వేల చొప్పున ఈనెల వరుసగా 3వ బెన్‌ఫిట్‌ను పొందనున్నారు. ఈనెల 7వ తేదీన రాష్టమ్రుఖ్యమంత్రి కెసిఆర్ గడచిన ఆర్ధిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన లాభాలలో 23శాతం లాభాలవాటాను కార్మికులకు ప్రకటించారు. అదేరోజు రాత్రి రూ 245.21కోట్ల రూపాయలు సింగరేణి కార్మికులకు మొదటి బెన్‌ఫిట్‌గా వారివారి బ్యాంకుఖాతాలలో జమఅయ్యాయి. తరువాత దసరాపండుగ సందర్భంగా పండుగ అడ్వాన్సుగా ఒక్కొక్క కార్మికునికి రూ 18వేల చొప్పున బ్యాంకు ఖాతాలలో 2వ బెన్‌ఫిట్‌గా జమచేశారు. తాజాగా జెబిసిసి ఐలో జరిగిన ఒప్పందం ప్రకారం ప్రతి బొగ్గుగని కార్మికునికి రూ 54వేల బోనస్‌ను చెల్లించాలని నిర్ణయం జరిగింది. ఈనిర్ణయం ప్రకారం సింగరేణి యాజమాన్యం మంగళవారం దీపావళి బోనస్‌ను బుధవారం చెల్లిస్తున్నట్లు సర్క్యూలర్ జారీచేసింది. సింగరేణి జనరల్‌మేనేజర్ (పర్సనల్) ఆర్‌సి, ఐఆర్‌అండ్‌పిఎం ఎ ఆనందరావు ఈమేరకు ఉత్తర్వులను జారీచేసారు. దీనిప్రకారం బుధవారం బ్యాంకుఖాతాల ద్వార దీపావళి బోనస్‌ను సింగరేణి కార్మికులు అందుకోనున్నారు. దీపావళి బోనస్ విషయంలో నిబంధనలు కూడా యాజమాన్యం ప్రకటించింది. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో భూగర్భగని ఉద్యోగులకు 190 మస్టర్లు, సర్ఫేస్ ఉద్యోగులకు 240 మస్టర్లు ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే మస్టర్ల ప్రాతిపదికన బోనస్ చెల్లింపులు చేస్తారు. అయితే సంవత్సరం మొత్తంలో 30 మస్టర్లకంటే తక్కువవున్న కార్మికులు దీపావళి బోనస్ పొందడానికి అనర్హులుగా యాజమాన్యం నిర్ణయించింది. దీపావళి బోనస్ రూపంలో సింగరేణిలో పనిచేస్తున్న ఎన్‌సిడబ్ల్యూఎ (నాన్ ఎగ్జిక్యూటీవ్స్) ఉద్యోగులంతా రూ 310కోట్ల రూపాయలను సింగరేణి యాజమాన్యం నుండి అందుకోనున్నారు.