ఖమ్మం

ఎన్నాళ్లీ పడిగాపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైరా, డిసెంబర్ 2: నల్లధనం మాటేమిటోగాని పెద్దనోట్ల రద్దుతో సామాన్యులకు, వృద్ధులకు బ్యాంకుల వద్ద పడిగాపులు తప్పడం లేదు. ఉదయం 9గంటల సమయానికే పెన్షన్లకోసం, జీతాలకోసం పలురకాల అవసరాలకోసం ముఖ్యంగా వృద్ధులు బ్యాంకులవద్ద వేచీ చూస్తున్నారు. కాగా బ్యాంకు అధికారులు కూడా బ్యాంకు తెరుచుకున్న గంట వరకు మాత్రమే రూ. 10వేలు ఇస్తున్నారు. ఆతరువాత సరిపడా నగదు లేక రూ. 5వేలు, లేక రూ. 6వేలు మాత్రమే ఇస్తామని సూచిస్తున్నారు. దీంతో వృద్ధులు ప్రతిరోజు మేము ఇలా పడిగాపులు కాయాల్సిందేనా అని బ్యాంకు అధికారులను నిలదీస్తున్నారు. అధికారులు కూడా మాచేతిలో ఏమిలేదు నగదు ఉంటే ఇవ్వడానికే కదా బ్యాంకులు ఉన్నదని చెప్తున్నారు. ఏది ఎమైనప్పటికీ వృద్ధులు అవస్థలు ఉదయానే్న బ్యాంకుల వద్ద చూస్తే అయ్యో అనక తప్పడం లేదు. మరోవైపు శుక్రవారంతో పాత రూ. 5వందల రూపాయలు చెలామణి పూర్తవుతుందని చెప్పడంతో కొందరు వాటిని బ్యాంకుల్లో వేసుకునేందుకు బారులు తీరారు. ఏదిఎమైనప్పటికీ నల్లదనం మాటేమిటో కాని పెద్దనోట్ల రద్దు ముందుగా సామాన్యులకు, వృద్ధులకు, చిరువ్యాపారులకు, మధ్యతరగతి ప్రజలకు తీవ్రఇబ్బందులే మిగిల్చాయి.

బ్యాంకు వద్ద పెన్షన్‌దారుల అవస్థలు
కామేపల్లి, డిసెంబర్ 2: మండలంలో మూడు బ్యాంకు శాఖలు ఉన్నప్పటికీ ఒకే బ్యాంకు ద్వారా అధిక మొత్తంలో పెన్షన్లను పంపిణీ చేయడంలో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు పెద్దనోట్ల రద్దు, మరోవైపు పెన్షన్‌దారులు బారులు తీరి ఉండటంతో ప్రధాన బ్యాంకు వద్ద అవస్థలు వర్ణనాతీతం. మండలంలో 4893మంది వృద్ధాప్యం, వితంతు, వికలాంగుల పెన్షన్‌దారులు ఉన్నారు. వీరిలో 3739మంది పెన్షన్‌దారులు మండలంలోని వివిధ బ్యాంకులకు కేటాయించారు. కాగా గతంలో మండలంలో 17 గ్రామ పంచాయతీలకు చెందిన ఈ లబ్ధిదారులు అధిక శాతం కామేపల్లి ఎస్‌బిహెచ్ బ్రాంచ్‌కు కేటాయించడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో పెన్షన్‌దారులు తమ బ్యాంకు అకౌంట్లు నమోదు చేసుకునేందుకు స్థానిక ఏపిజివిబి, పండితాపురం ఏపిజివిబి ఖాతా నెంబర్లు అందజేయగా వాటిని కంప్యూటర్లు తిరస్కరిస్తున్నాయంటూ మండలంలోని పెన్షన్‌దారులందరిని ఎస్‌బిహెచ్ శాఖాయందు ఖాతాలు తెరిపించి పెన్షన్లను వాటిలో జమ చేస్తున్నారు. కాగా నోట్ల రద్దు, వివిధ ఇబ్బందుల నేపథ్యంలో కేవలం ఎస్‌బిహెచ్ శాఖ వద్దనే పెన్షన్‌దారులు బారులు తీరడం, గ్రామీణ బ్యాంకులలో ఎటువంటి పెన్షన్లు అందజేయకపోవడంతో వారు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా ఏపిజివిబి శాఖలకు సంబంధిత గ్రామాలను కేటాయించవల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.