ఖమ్మం

పెద్దనోట్ల రద్దుతో రైతులకు ఇక్కట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), డిసెంబర్ 2: పెద్దనోట్ల రద్దుతో రైతులు, కూలీలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు నేపథ్యంలో ఏర్పడిన పరిణామాలపై ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ అనాలోచిత పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో రైతాంగం కుదేలైందన్నారు. వారు పండించిన పంటను కూడా అతి తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితులు దాపురించాయని, కనీస పెట్టుబడులు కూడా రావడం లేదన్నారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును పొంగులేటికి వినిపించారు. తిరుమలాయపాలెం బీరోలు గ్రామానికి చెందిన బిక్షం అనే రైతు తన ఆవేదన వెల్లడిస్తూ పెసల మద్దతు ధర 5,225రూపాయలు ఉండగా తాను కేవలం మూడువేలకే విక్రయించానని చెప్పారు. మరొక రైతు వ్యాపారి వంద రూపాయల నోట్లు ఇస్తానంటే క్వింటా పెసర్లు మూడువేలకే ఇచ్చానని పొంగులేటికి వివరించారు. పరిస్థితులు గమనించిన పొంగులేటి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేస్తూ ముందస్తు చర్యలు చేపట్టడంలో ఘోరంగా విఫలమైందన్నారు. చిన్ననోట్ల కొరత తీవ్రంగా ఉందని, ఏటిఎంలు బారులు తీరుతున్న ప్రజలకు ఒక్క రెండువేల నోట్లు తప్ప చిల్లర రాకపోవడంతో అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందన్నారు. పెద్దనోట్ల రద్దుతో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కట్ల రంగారావు, ఎస్‌కె ఫజల్, వీరారెడ్డి, గోపాల్, సత్యం, వినోద్, సైదులు తదితరులు పాల్గొన్నారు.