ఖమ్మం

నగదు రహిత లావాదేవీలపై కలెక్టర్ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 2: జిల్లాలో నగదు రహిత లావాదేవీల నిర్వహణకు అవగాహన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో తహశీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీల అమలును గ్రామీణ ప్రాంతాల్లో విస్తరింపజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిత్యం అవసరమయ్యే నిత్యవసర వస్తువుల దుకాణాల్లో నగదు రహిత లావాదేవీల కార్యచరణ విస్తరించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. అన్ని గ్రామాల్లోని ఉపాధ్యాయులు, అంగన్‌వాడి వర్కర్స్, విఆర్వో, విఆర్‌ఏలు, సెల్ఫ్ గ్రూప్‌లను సమన్వయపర్చి నగదు రహిత లావాదేవీలపై ప్రజలను చైతన్యపర్చాలన్నారు. నగదు రహిత లావాదేవీలను సులభతరంగా వినియోగించుకునేందుకు ఐదు విధాలుగా ప్రవేశపెట్టిన ఆప్షన్లపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఎన్ని విధాలుగా నగదు రహిత లావాదేవిలు జరపవచ్చునో, డిజిటల్ పేమెంట్‌ను ఎలా చేయవచ్చునో వాటిని గురించి పవర్ ప్రజంటేషన్ ద్వారా వివరించాలన్నారు. యుఎస్‌ఎస్‌డి, యుపిఐ, ఈవ్యాలెట్, పిఓఎస్, ఎఇపిఎస్ విధానాన్ని వినియోగించుకునే తీరును బ్యాంకర్లను భాగస్వామ్యం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్ కూలీలకు బ్యాంకు ఖాతాల ద్వారా ఆధార్ అనుసంధానం చేయించి నగదు రహిత లావాదేవిలు జరుపుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పెన్షన్ దారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పంచాయతీల్లో నగదు రహిత లావాదేవిలను అమలు చేయడంతో పాటు భౌతిక నగదు వినియోగాన్ని తగ్గించి నగదు సమస్యను పరిష్కరించాలన్నారు. సమావేశంలో జెసి వినయ్‌కృష్ణారెడ్డి, అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపిడిఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.