ఖమ్మం

భద్రాద్రికి మంచి రోజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఏప్రిల్ 8: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ద్వారా దారుణంగా నష్టపోయిన ప్రాంతాల్లో భద్రాచలందే అగ్రస్థానం. భద్రాచలం నియోజకవర్గం ముక్కలు చెక్కలై అవన్నీ ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో కలిశాయి. ప్రధానంగా పోలవరం ముంపు పేరుతో వీఆర్‌పురం, కూనవరం, చింతూరు, భద్రాచలం రూరల్ ప్రాంతాలన్నీ ఆంధ్రాలో విలీనం అయ్యాయి. భద్రాచలం పట్టణం చుట్టూ ఆంధ్రా భూభాగమే. రామయ్య భూములు 1000 ఎకరాలు ఆంధ్రాలోకి వెళ్లిపోయాయి. భద్రాచలం ద్వీపకల్పంగా మారి, కనీసం డంపింగ్ యార్డుకు స్థలం లేదు. గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక భద్రాచలం అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకున్నాయి. సుమారు 5వేల కుటుంబాలు ఉపాధి లేక ఊరు విడిచి వెళ్లిపోయాయి. పలు ప్రభుత్వ కార్యాలయాలు తరలించబడ్డాయి. దీంతో భద్రాచలం మూలకు విసిరివేయబడ్డ ప్రాంతంగా మారిపోయింది. ఈ క్రమంలో ఇటీవలే తెలుగుదేశాన్ని వీడి తెరాసలోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రి మంత్రి వర్గంలో కొలువుదీరిన తుమ్మల నాగేశ్వరరావు రాకతో భద్రాచలం స్వరూపమే మారిపోయింది. శ్రీరామనవమికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకు వస్తున్న నేపథ్యంలో భద్రాచలం అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇటీవలే జిల్లా యంత్రాంగం, ముఖ్యప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రితో భేటీ అయి మాస్టర్ ప్లాన్‌కు నడుంబిగించారు. 5 గ్రామ పంచాయితీలను ఆంధ్రా నుంచి తిరిగి తెలంగాణలోకి తెచ్చేందుకు కేంద్రం, అటు ఆంధ్రా సీఎం చంద్రబాబునాయుడుని ఒప్పించారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టడమే తరువాయి. విలీనం అయ్యాక భద్రాచలం పట్టణాభివృద్ధికి ప్రణాళికలు, ముందుగా రామాలయం అభివృద్ధికి దివ్యభద్రాద్రి అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశారు.
ప్రభుత్వం మదిలో...
అయోధ్యలోని రాముడి కంటే దక్షిణ భారతదేశంలోని శ్రీరామదివ్యక్షేత్రం భద్రాచలమే ప్రాశస్త్యాన్ని సంతరించుకుని దినదినాభివృద్ధి చెందుతోంది. స్థల పురాణం, రాముడు ఈ నేలపై నడయాడిన చిహ్నాలు జగద్విదితం. అందుకే భద్రాచలాన్ని ప్రముఖ ఆలయ ఆధారిత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అథారిటీని ఏర్పాటు చేయాలనే యోచన ఇటీవల ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో చర్చకు వచ్చింది. ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు ఉండవు. ప్రజాప్రతినిధులు ఉండరు. ప్రత్యేకాధికారి సమక్షంలో అభివృద్ధి పనులు జరుగుతాయి. దీనివల్ల అభివృద్ధికి బాటలు పడతాయనేది ప్రభుత్వ ఆలోచన. గతంలోనూ భద్రాచలంను శ్రీరామదివ్యక్షేత్రం టౌన్‌షిప్‌గా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐఏఎస్ అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించింది. 2000 సంవత్సరం తర్వాత కొంతకాలం టౌన్‌షిప్‌గా ఉన్నా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పంచాయతీగా, మరికొద్ది రోజులు మున్సిపాల్టీగా మార్చాయి. రెండేళ్ల క్రితం మేజర్ గ్రామపంచాయితీగా మార్చి ఎన్నికలు నిర్వహించారు. పాలకమండలిని ఏర్పాటు చేశారు. ఇపుడు అథారిటీ, ప్రత్యేక జోన్ ఏర్పాటు అంశాలు తెరపైకి వస్తుండటంతో భద్రాచలం అభివృద్ధికి తిరిగి మంచి రోజులు వస్తున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 5 పంచాయతీలు విలీనం అయితే వాటితో కలిపి అథారిటీ ఏర్పాటు చేయాలా? లేక భద్రాచలం పట్టణం చుట్టూ 10 కి.మీల విస్తీర్ణం వరకే పరిమితం చేయాలా? అనే అంశాలపై కూడా ఇటీవలి ముఖ్యమంత్రి సమావేశంలో తర్జనభర్జనలు పడ్డట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ పాలకుల ఆలోచనలు, కార్యాచరణలు భద్రాచలం పట్టణ ప్రజలకు ఎడారిలో ఒయాసిస్సుల్లా కన్పిస్తున్నాయి. మంచిరోజులు వచ్చినట్లేనని వారు సంబరాల్లో మునిగితేలుతున్నారు.