ఖమ్మం

ఉల్లాసంగా...ఉత్సాహంగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, మార్చి 12: పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం పట్టణంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. సాంప్రదాయ పద్ధతిలో హోలీ వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడలిలో శనివారం రాత్రి యువకులు గ్రూపులుగా ఏర్పడి కాముడి సంహార కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో బంజార మహిళలు ఆటపాట కార్యక్రమాలను నిర్వహించారు. పలు రకాల రంగులు చల్లుకుంటూ పట్టణంలో యువకులు సందడి చేశారు. ఆదివారం స్థానిక కెసిఓ క్లబ్‌లో నిర్వహించిన హోలీ వేడుకల్లో భద్రాద్రి జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అంబర్‌కిషోర్‌ఝా, సింగరేణి కాలరీస్ డైరెక్టర్ (్ఫ) పవిత్రన్ కుమార్ రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు కూడా హోలీ సంబరాలు చేశారు. చిన్న బజార్, పెద్ద బజార్‌లో మార్వాడి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో యువకులు పెద్ద ఎత్తున హాజరై రంగులు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ బస్తీల్లో ఊరేగింపులు నిర్వహించారు.
ఖమ్మం పోలీసుల ఆధ్వర్యంలో
ఖమ్మం(జమ్మిబండ): పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. పోలీసుల కుటుంబ సభ్యులంతా పోలీస్ కవాతు మైదానానికి చేరుకొని వేడుకల్లో పాల్గొన్నారు. అదనపు కమిషనర్ సాయిరెడ్డితో పాటు ఉన్నతాధికారులంతా ఈ వేడుకల్లో పాల్గొని పోలీసుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఏఎస్పీ డమ్కు వాయిస్తూ హోలీ వేడుకల్లో పాల్గొన్న వారిలో మరింత ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొని రంగులు చల్లుకున్నారు.