ఖమ్మం

చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురంహవేలి, నవంబర్ 18: ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా లీగల్ సెల్ అథారిటి చైర్మన్, ప్రిన్సిపల్ అండ్ డిస్ట్రిక్ జడ్జి యం లక్ష్మణ్ సూచించారు. శనివారం స్థానిక మమత ఆసుపత్రిలో జిల్లా లీగల్‌సెల్ సర్వీసెస్ అధారిటి ఆధ్వర్యంలో పువ్వాడ ఫౌండేషన్ సహకారంతో వృద్ధులకు ఉచిత ఆరోగ్య శిబిరం, చట్టాలపై నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వృద్ధుల ఆరోగ్య పరిరక్షణ అనేది వారికున్న హక్కులలో భాగమన్నారు. ఎన్ని చట్టాలు చేసినా వాటిపై అవగాహన లేక కొంతమంది కుటుంబ సభ్యులు వృద్ధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అటువంటి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవచ్చన్నారు. సమాజంలో చట్టాలపై అవగాహన కల్పించేందుకు లీగల్ సర్వీసెస్ అథారిటి ప్రత్యేక శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అవగాహన కార్యక్రమాలతో పాటు ఆరోగ్య శిబిరాలు నిర్యహించడం ద్వారా వృద్ధులకు మనోధైర్యం, చేయూతనిచ్చినట్లు అవుతుందన్నారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటి న్యాయమూర్తి వినోద్‌కుమార్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులు వృద్ధుల ఆస్తులను బదాలాయింపు చేసుకొని వారిని పట్టించుకొకపోతే ఆర్డిఒ ద్వారా ఆ బదలాయింపును కూడా రద్దు చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో న్యాయ సేవా సదన్‌కు చెందినవారు కూడా హాజరై ఫిర్యాదు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఆర్హులైన వారిక ఉచిత న్యాయసాయం అందించడం జరుగుతుందన్నారు. ఆరోగ్య శిబిరాన్ని ఎర్పాటు చేసిన ఆసుపత్రి యాజమాన్యానికి, జిల్లా బార్ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం శాసన సభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ 25 ఏళ్ళ క్రితం మమత ఆసుపత్రిని ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాలతోపాటు చత్తీస్‌గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు. రెండు దశాబ్దాల క్రితం స్థాపించిన మమత వైద్య కళాశాల వైద్య విద్యను అభ్యసించిన అనేక మంది ప్రపంచ దేశాలలో వైద్య సేవలు అందించడం గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో గంగాధర్, భాగం కిషన్, బాబు, మలువురు న్యాయ వాదులు పాల్గొన్నారు.