ఖమ్మం

సుబాబుల్‌కు గిట్టుబాటు ధర కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మార్చి 23: సుబాబుల్ పంటకు టన్నుకు 7వేలు, జామాయిల్‌కు 7500 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని, దళారీ వ్యవస్ధను రద్దు చేస్తామని, డంపింగ్ యార్డులను ఏర్పాటు చేస్తామని ఐటిసి యాజమాన్యం ఇచ్చిన హామీని అమలు చేయాలని తెలంగాణ సుబాబుల్, జామాయిల్ రైతుసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో సుబాబుల్, జామాయిల్ రైతు సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం సంఘం అధ్యక్షుడు ఎకె రామారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వివిధ పార్టీ నాయకులు, రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ సుబాబుల్, జామాయిల్ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై గత రెండు నెలలుగా రైతాంగం ఐక్యంగా ఉద్యమించిన ఫలితంగా యాజమాన్యం రైతులతో రెండుదఫాలుగా చర్చించి కొన్ని డిమాండ్లను ఆమోదించిదన్నారు. ధర నిర్ణయంలో హెడ్ ఆఫీస్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, డంపింగ్‌యార్డు ఏర్పాటుచేస్తామని, దళారీ వ్యవస్ధను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని యాజమాన్యం గాలికొలిలేసిందని ఆరోపించారు. సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, సిపిఎం నున్నా నాగేశ్వరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, టిడిపి జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్య, తెలంగాణ కాంగ్రెస్ రైతుసంఘం రాష్ట్ర కో కన్వీనర్ దాసరి దానియేలు, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, బిజెపి రైతుసంఘం నాయకులు గంటేల విద్యాసాగర్‌లు పాల్గొని సుబాబుల్ , జామాయిల్ రైతుల న్యాయమైన డిమాండ్‌లు పరిష్కారం అయ్యేవరకు అండగా ఉంటామని హమీనిచ్చారు. వారు చేపట్టే ప్రతి ఉమ్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

భక్తిప్రపత్తులతో ధ్వజపట భద్రక మండలలేఖనం
భద్రాచలం టౌన్, మార్చి 23: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజున శుక్రవారం ధ్వజపట భద్రత మండల లేఖనం కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. తెల్లని వస్త్రంపై గరుత్మంతుడి చిత్రాన్ని చిత్రీకరించి స్థానిక జీయర్ మఠంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సమయంలో ఈ చిత్రాన్ని గీసిన అర్చకుడిని దేవస్థానం తరఫున సన్మానించారు. అనంతరం భాజా భజంత్రీలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య రామాలయానికి ధ్వజాన్ని తీసుకెళ్లారు. దీనికి ముందు విశ్వక్సేన పూజ, అవాహన, పుణ్యాహవచనం గావించారు. శనివారం ధ్వజారోహణం నిర్వహిస్తున్న క్రమంలో గరుత్మంతుడి చిత్రపటానికి గరుడాధివాసంను భక్తి ప్రవత్తులతో నిర్వహించారు. అనంతరం యాగశాలలో ఆదివాస కార్యక్రమలను నిర్వహించారు. వేడుకలో భాగంగా ఉదయం బింబం, కుంభం, మండలం, అగ్ని అనే చతుస్థానార్చన పూజలు చేశారు.
ఆలయంలో నేటి కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రామాలయంలో ఉదయం అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, చతుస్థానార్చనం, సాయంత్రం భేరీపూజ, దేవతాహ్వానం, బలిహరణం, రాత్రి 8 గంటల నుంచి తిరువీధిసేవ, హనుమత్ హవనము నిర్వహించనున్నారు.

ప్రజల స్వేచ్ఛకు భంగం కల్గించొద్దు
ఖమ్మం(క్రైం), మార్చి 23: ప్రజలు స్వేచ్ఛ జీవనం కోరుకుంటారని వారి ఆత్మగౌరవానికి ఎలాంటి భంగం కలుగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీస్‌కమీషనర్ తఫ్సీర్‌ఇక్భాల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖమ్మం డివిజన్ పోలీస్ అధికారులతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ఆదేశాలమేరకు నూతన ఈ-పెట్టి కేసు యాప్ ద్వారా రికార్డు చేసిన ప్రతి చిన్న కేసును నిష్పక్షపాతంగా పోటోలతో సహా అన్ని వివరాలను యాప్‌లో పొందుపర్చాలన్నారు. పెట్టి కేసుల్లో చట్టాలను అతిక్రమించిన వారిపై ఎలాంటి ఆర్భాటం చేయకుండా ఫొటోలు తీసి కేసులు నమోదుచేసి హుందాతనంగా వ్యవహరించాలన్నారు. సమర్థవంతమైన పర్యవేక్షణలో నేర పరిశోధన, లోతైన విచారణకు అవసరమైన నిర్మాణాత్మక ఫార్మెట్ ప్రొఫార్మ ద్వారా రూపొందించుకోవాలన్నారు. నేర సంఘటన ప్రదేశాలకు ముందుగా సమీపంలోని బ్లూకోడ్స్, బీట్‌బ్యూటీ, గస్తీ తిరుగుతున్న హోంగార్డులు, కానిస్టేబుళ్ళు చేరుకుంటారన్నారు. చిన్న కేసులు కదా అని వదిలివేస్తే ఆయా ప్రాంతాంల్లో గ్రేవ్ కేసులు పెరిగే అవకాశాలున్నాయన్నారు. పోలీస్ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి కొల్లు సురేష్‌కుమార్, టౌన్ ఎసిపి గణేష్, సిసిఆర్బీ ఎసిపి రామానుజం తదితరులు పాల్గొన్నారు.

పార్లమెంట్‌లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి
ఖమ్మం(క్రైం), మార్చి 23: పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని ఎమ్మార్మిఎస్ జిల్లా నాయకులు తూరిగంటి అంజయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ధర్నాచౌక్ వద్ద చేపట్టిన 2వ రోజు ఎమ్మార్మిఎస్ రిలే నిరాహార దీక్షను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఎంపి, రాజ్యసభ సభ్యులు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కృషిచేయాలన్నారు. అధికారంలోకి వస్తే, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్దత చేకూరుస్తామని బిజెపి నేతలు విస్మరించారన్నారు. బిల్లును ప్రవేశపెట్టేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.
ట్యాంక్‌బండ్‌ను పరిశీలించిన సీపీ
ఖమ్మం(క్రైం), మార్చి 23: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఈ నెల 26న జరగనున్న సీతారామచంద్రుల కళ్యాణం ఏర్పాట్లపై శుక్రవారం సాయంత్రం ఖమ్మం సిపి తఫ్సీర్ ఇక్భాల్ లకారంట్యాంక్ బండను పరిశీలించారు. ఎంతో అంగరంగవైభవంగా ఇక్కడ తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. అందుకోసం బందోబస్త్ ఏర్పాట్లపై బండను క్షణ్ణంగా పరిశీలించారు. ద్విచక్ర వాహనంపై ఎసిపి గణేష్‌ను ఎక్కించుకొని ట్యాంక్‌బండ పరిసరాలన్నింటిని కలియతిరుగుతూ పరిశీలించారు. నవమి ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బందోబస్త్ ఏర్పాట్లను చేపట్టాలన్నారు. సిపి వెంట అర్భన్ సిఐ నాగేంద్రాచారి, కార్పొరేటర్లు ఉన్నారు.