ఖమ్మం

జీవ వైవిధ్యంపైనే మానవ మనుగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), మార్చి 23: మానవుని మనుగడ జీవ వైవిధ్యంపైనే ఆధారపడి ఉందని, అంతరించిపోతున్న జీవరాశులను కాపాడుకోవాలని జిల్లా జీవవైవిధ్య కమిటీ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా వైవిధ్య కమిటీ కోఆర్డినేటర్ బాసిపంగు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన జీవ వైవిధ్య చట్టం అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా మానవ జీవన విధానంలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. పెరుగుతున్న టెక్నాలజీతో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. దీంతో పక్షులు, చెట్లు, జీవరాసులు అంతరించిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రభుత్వం అనేక చట్టాలను రూపొందించిందన్నారు. జీవ వైవిధ్య 2002-2015 చట్టంపై రాష్ట్ర నుండి గ్రామ స్థాయి వరకు కమిటీలను ఏర్పాటుచేసి పర్యావరణానికి హాని కలిగించే ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఇతర ఏ సంస్థలైన హాని తలపెడితే వాటిపై చర్యలు తీసుకునే అధికారం ఆయా పరిధిలోని కమిటీలకు ఉంటుందన్నారు. ఈ కమిటీలు రాజ్యాంగబద్ధంగా నియమ నిబంధనలను పాటించడం జరుగుతుందన్నారు. పక్షులు, చెట్లు, జీవరాశులను చంపిన పర్యావరణానికి హానికరమైన మట్టి తోలకాలు చేపట్టి వ్యాపారాలకు మలచుకున్న వాటికి అనుమతి లేకపోతే కమిటీకి చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం ఉంటుందన్నారు. జీవ వైవిధ్యచట్టంపై సంస్థలు, ప్రజలు మరింత అవగాహన పెంచుకొని భావితరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ అవగాహన సదస్సుకు ముఖ్యఅతిధిగా రాష్ట్ర కోఆర్డినేటర్ జి సైదులు, జిల్లా, మండల, గ్రామ, జీవ వైవిధ్య కమిటీ చైర్మన్‌లు, కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు.