ఖమ్మం

ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం రూరల్, జూలై 17: రాజకీయాలకు అతీతంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం మండలంలోని మద్దులపల్లి, తెల్దారుపల్లి, వెంకటగిరి గ్రామాలలో ఎస్సీ కమ్యూనిటీహాళ్లు, రోడ్డు నిర్మాణానికి ఆయన శంఖుస్థాపన చేశారు. ఈసందర్భంగా జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రభుత్వాలకే తమ మద్దతు తెలిపేందుకు సంసిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ఆయన వెల్లడించారు. పాలేరు ప్రజలు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించారని, రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాలలో సమానంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల రుణం తీర్చుకుంటున్నానని తుమ్మల స్పష్టం చేశారు. మిషన్ భగీరధ పథకం కింద అతికొద్ది రోజుల్లోనే నీళ్ళిచ్చి ఆడపడుచుల ఇబ్బందులు తొలగిస్తామన్నారు. వచ్చే నెల నుంచి బోధకాలు బాధితులకు పెన్షన్ ఇవ్వనున్నట్టు తెలిపారు. రైతుబంధు పథకం రైతులకు ఎంతో భరోసానిచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్ తదితర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. తాను ఓట్లకోసం అభివృద్ది పనులు చేయడంలేదని, అన్ని గ్రామాలు తనకు సమానమేనని, ప్రజలు అభివృద్దికే ఓటేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఆయా గ్రామాల ప్రజలు స్మశానవాటికలకు స్ధలాలు కేటాయించాలని, ఇళ్లస్థలాలు ఇవ్వాలని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఆంధ్రాబ్యాంక్ చైర్మన్ తమ్మినేని కృష్ణయ్య, పెద్దలు తమ్మినేని కోటేశ్వరరావు, ఎంపిపి లలిత, జెడ్పీటిసి భారతి, సర్పంచ్ భిక్షం, ఆత్మ చైర్మన్ మద్ది మల్లారెడ్డి, నాయకులు సాధు రమేష్‌రెడ్డి, బెల్లం వేణు, రామ్మూర్తినాయక్ తదితరులు పాల్గొన్నారు.